Stock Market: తీవ్ర ఒడుదొడుకుల సెషన్లో చివరకు లాభాలు

Stock Market: తీవ్ర ఒడుదొడుకుల సెషన్లో చివరకు లాభాలు
Stock Market Closing: తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 85, నిఫ్టీ 45 పాయింట్లు పెరిగాయి.
Stock Market Closing: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లో లాభాలను నమోదుచేశాయి. ఆరంభంలో నష్టాలతో ట్రేడయినా.. చివరకు కోలుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 85 పాయింట్లు పెరిగి.. 61 వేల 235 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ మళ్లీ పుంజుకుంది. 60 వేల 950 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ 200 పాయింట్లు పెరిగి 61 వేల 349 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో.. 18 వేల 258 వద్ద సెషన్‌ను ముగించింది.
లోహ రంగం షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్ రంగం షేర్లు పతనం అయ్యాయి.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అత్యధికంగా దాదాపు 5 శాతం మేర లాభపడ్డాయి. కోల్ ఇండియా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, యూపీఎల్ కూడా రాణించాయి.
విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ డీలాపడ్డాయి.
ఇవీ చూడండి: క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ- టీసీఎస్ భారీ బైబ్యాక్ ఆఫర్
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాను ప్రభుత్వం నడుపుతుందా?
