ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు.. భారీగా పెరిగిన పేటీఎం షేరు

author img

By

Published : Mar 24, 2022, 3:42 PM IST

Stock Market Close

Stock Market Close: తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్​ 89, నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయాయి.

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం సెషన్​లో ఫ్లాట్​గా ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 89 పాయింట్లు కోల్పోయి 57 వేల 596 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ పాయింట్లు 23 పాయింట్లు తగ్గి.. 17 వేల 223 వద్ద సెషన్​ను ముగించింది. నేటి సెషన్​లో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. లోహం, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్​ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ఫ్లాట్​గా ట్రేడయ్యాయి.

  • సెన్సెక్స్​ తొలుత దాదాపు 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. 57 వేల 139 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
  • అనంతరం కాస్త కోలుకున్నా.. తీవ్ర ఒత్తిడిలో ట్రేడింగ్​ సాగించింది.
  • మళ్లీ 130 పాయింట్లకుపైగా పెరిగి 57 వేల 828 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని నమోదుచేసింది.

దూసుకెళ్లిన పేటీఎం: బీఎస్​ఈ 30 క్యాప్​ ఇండెక్స్​లో సగం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి సెషన్​లో డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, హిందాల్కో, కోల్​ ఇండియా, అల్ట్రాటెక్​ సిమెంట్​, టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ రాణించాయి. కోటక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ పడిపోయాయి. లిస్టింగ్​ అయినప్పటి నుంచి భారీగా పతనమవుతూ వస్తున్న పేటీఎం షేరు.. గురువారం సెషన్​లో ఒక్కసారిగా పుంజుకుంది. 9 శాతం పెరిగి 571.40 వద్ద ముగిసింది. ఓ దశలో ఏకంగా 12 శాతానికిపైగా పెరిగింది. 521 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని నమోదుచేసిన షేరు.. అనంతరం ఒక్కసారిగా దూసుకెళ్లింది. జీ ఎంటర్​టైన్​మెంట్ ఎంటర్​ప్రైజెస్​ షేరు ఏకంగా 17 శాతం పెరగడం విశేషం. ఓ దశలో 20 శాతానికిపైగా పెరిగి 307.25 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని తాకింది. చివరకు 299 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి: ఐఓబీ, సీబీఐ ప్రైవేటీకరణ? ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్​ఎస్​!

భారీగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.