బంగారం ధరకు రెక్కలు.. రూ.1100 పెరిగిన కేజీ వెండి!

బంగారం ధరకు రెక్కలు.. రూ.1100 పెరిగిన కేజీ వెండి!
బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల పసిడి గురువారంతో పోలిస్తే.. రూ.330 అధికమైంది. వెండి ధర సైతం పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today: దేశంలో పసిడి ధర మళ్లీ పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే 10గ్రాముల బంగారం రూ.330 వృద్ధి చెందింది. వెండి ధర కూడా అదే బాటలో పయనించింది. కేజీ వెండి రూ.1,110మేర పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold rate in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.53,680 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.70,890గా ఉంది.
- గుంటూరులో పది గ్రాముల మేలిమి బంగారం రూ.53,680గా ఉంది. కిలో వెండి ధర భారీగా పెరిగి.. రూ.70,890కు చేరుకుంది.
- వైజాగ్లో బంగారం ధర రూ.53,680గా ఉండగా... కిలో వెండి ధర రూ.70,890 పలుకుతోంది.
Spot Gold rate: స్పాట్ గోల్డ్ ధర సైతం భారీగా పెరిగింది. ఔన్సు పుత్తడి 20 డాలర్లు పెరిగి.. 1958కి పైగా ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ 25.64 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా రేట్లు ఇవే
