ధన్​ధనాధన్ 'రిలయన్స్'​-​ రూ.16లక్షల కోట్లకు ఎం-క్యాప్​

author img

By

Published : Sep 27, 2021, 1:23 PM IST

Reliance Industries

దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)​ మార్కెట్ క్యాపిటల్ కొత్త రికార్డు సృష్టించింది. స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్లు (Reliance Share price) సోమవారం నూతన గరిష్ఠానికి చేరాయి. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటల్​ (Reliance M-cap) రూ.16 లక్షల కోట్లు దాటింది.

స్టాక్ మార్కెట్లలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance new record) మరో కొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ.16 లక్షల కోట్లు దాటింది. గత కొన్నాళ్లుగా అతిపెద్ద లిస్టెడ్​ (Biggest listed company in India) కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్​ ఇండస్ట్రీస్​ తన రికార్డు.. తానే బద్దలుకొడుతూ ముందుకు సాగుతోంది. కరోనా వల్ల కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. స్వల్ప కాలంలోనే తేరుకుని.. ముందుకు సాగితోంది రిలయన్స్​ ఇండస్ట్రీస్​.

బీఎస్​ఈ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్​ (ఎం-క్యాప్​) ప్రస్తుతం (Reliance M-cap) రూ.16 లక్షల కోట్ల వద్ద ఉంది.

Mukesh Ambani, RIL Chairman
ముకేశ్​ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత

జీవనకాల గరిష్ఠానికి షేర్లు..

సోమవారం సెషన్​లో రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు సరికొత్త రికార్డు (Reliance Share price) స్థాయికి చేరాయి. మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి సానుకూలంగా స్పందిస్తున్న సూచీలు.. మిడ్​ సెషన్​ తర్వాత..1.70 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. దీనితో ఒక షేరు విలువ తొలిసారి రూ.2,525పైకి చేరింది.

ఎన్​ఎస్​ఈలోనూ కంపెనీ షేర్లు 1.70 శాతం లాభంతో.. ఒక్కో షేరు రూ.2,525 దగ్గర్లో ట్రేడవుతోంది.

ఇదీ చదవండి: Happy Birthday google: నేడు 'గూగుల్' వార్షికోత్సవం-డూడుల్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.