నిమిషానికి ఆ కంపెనీల సంపాదన ఎంత?

author img

By

Published : Oct 16, 2021, 4:00 PM IST

companies earnings per minute

భారతీయ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్నాయి. కరోనా సంక్షోభాన్ని తట్టుకొని మరీ రాణిస్తున్నాయి. రిలయన్స్​, టాటా, ఇన్ఫోసిస్​.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. అయితే ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయి అనేది చాలా మందికి తెలియదు. ఓ నిమిషానికి భారతీయ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసుకుందాం.

1991లో నాటి ప్రధాని పి.వి.నర్సింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలు భారతదేశ రూపురేఖల్నే మార్చేశాయి. అప్పటి వరకు లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థతో కునారిల్లుతున్న దేశీయ ప్రైవేటు రంగం.. ఒక్కసారిగా జూలు విదిల్చింది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన అనేక కంపెనీలు వ్యాపారంలో భారతదేశ సత్తా ఏంటో చాటాయి. రూ.లక్షల కోట్ల సంపదను సృష్టిస్తూ అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదిగాయి. ముఖ్యంగా ఐటీ సేవల్లో భారత్‌కు తిరుగులేకుండా పోయింది.

అయితే, 2008లో ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా సంక్షోభం వల్ల కంపెనీల ఆర్థిక పరిస్థితి కొంతమేర కుంటుపడింది. అయినప్పటికీ.. బలమైన పునాదుల కారణంగా వేగంగా కోలుకున్నాయి. అయితే, కొన్ని సంస్థలు కరోనా సంక్షోభాన్ని సైతం తట్టుకొని రాణించాయి. కొన్ని కంపెనీలు గణనీయ స్థాయిలోనే లాభాల్ని ఆర్జిస్తున్నాయి. మరి లాభార్జనలో ముందున్న తొలి 10 కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో చూద్దామా..!

indian companies earnings per minute
రిలయన్స్​

తిరుగులేని రిలయన్స్‌

ఆసియాలోనే అత్యంత కుబేరుడు.. ఇటీవలే 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. లాభార్జనలో తొలిస్థానంలో ఉంది. నిమిషానికి ఈ కంపెనీ రూ.9.34 లక్షలు సంపాదిస్తోంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీ చమురు శుద్ధి, రసాయనాలు, టెలికాం, స్వచ్ఛ ఇంధన సహా మరికొన్ని రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది.

indian companies earnings per minute
టీసీఎస్​

టీసీఎస్‌

ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ టాటా గ్రూప్‌ సంస్థల్లో ప్రధానమైంది. నాణ్యతకు పెట్టింది పేరైనా ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఐటీ సేవల్ని అందిస్తోంది. ఈ కంపెనీ నిమిషానికి రూ.6.17 లక్షల లాభాల్ని ఒడిసిపడుతుండడం విశేషం.

indian companies earnings per minute
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ప్రధాన కేంద్రం: ముంబయి

విభాగం: బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు

నిమిషానికి లాభం: రూ.6.05 లక్షలు

indian companies earnings per minute
ఎస్​బీఐ

సంస్థ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ప్రధాన కేంద్రం: ముంబయి

విభాగం: బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు

నిమిషానికి లాభం: రూ.4.26 లక్షలు

indian companies earnings per minute
ఇండియన్​ ఆయిల్​

సంస్థ: ఇండియన్‌ ఆయిల్‌

ప్రధాన కేంద్రం: ముంబయి

విభాగం: ఇంధనం

నిమిషానికి లాభం: రూ.4.11 లక్షలు

indian companies earnings per minute
ఇన్ఫోసిస్​

సంస్థ: ఇన్ఫోసిస్‌

ప్రధాన కేంద్రం: బెంగళూరు

విభాగం: ఐటీ సేవలు

నిమిషానికి లాభం: రూ.3.68 లక్షలు

indian companies earnings per minute
హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌

సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌

ప్రధాన కేంద్రం: ముంబయి

విభాగం: ఆర్థిక సేవలు

నిమిషానికి లాభం: రూ. 3.56 లక్షలు

indian companies earnings per minute
ఐసీఐసీఐ బ్యాంక్​

సంస్థ: ఐసీఐసీఐ బ్యాంక్‌

ప్రధాన కేంద్రం: వడోదరా

విభాగం: బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు

నిమిషానికి లాభం: రూ. 3.49 లక్షలు

indian companies earnings per minute
ఓఎన్​జీసీ

సంస్థ: ఓఎన్‌జీసీ

ప్రధాన కేంద్రం: దిల్లీ

విభాగం: ఇంధనం

నిమిషానికి లాభం: రూ. 3.09 లక్షలు

indian companies earnings per minute
బీపీసీఎల్​

సంస్థ: భారత్‌ పెట్రోలియం

ప్రధాన కేంద్రం: ముంబయి

విభాగం: ఇంధనం

నిమిషానికి లాభం: రూ. 3.07 లక్షలు

ఇదీ చూడండి: రిలయన్స్​ చేతికి ఆర్​ఈసీ సోలార్- రూ.5,800 కోట్ల డీల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.