ఐటీ, ఏఐలో టీసీఎస్ ఫ్రీ కోర్సులు- అప్లై చేయండిలా...

author img

By

Published : Sep 27, 2021, 5:08 PM IST

TCS COURSE

ఐఆన్ కెరీర్ ఎడ్జ్ (TCS iON Career Edge) ప్రోగ్రామ్​లో భాగంగా గ్రాడ్యుయేట్ల కోసం ఉచితంగా కోర్సులు అందిస్తోంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దీనికి రిజిస్టర్ అయిన వారికి పదిహేను రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించనుంది. (TCS iON Career Edge) ట్రైనింగ్ పూర్తైతే.. సర్టిఫికేట్ సైతం ఇవ్వనున్నట్లు తెలిపింది.

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (TCS news).. యువత కోసం 'టీసీఎస్​ ఐఆన్​ కెరీర్ ఎడ్జ్​' ప్రోగ్రామ్​ను (TCS iON Career Edge) ప్రారంభించినట్లు ప్రకటించింది. ఉద్యోగాల కోసం వెతికే వారిని ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్​ను తీసుకొచ్చినట్లు తెలిపింది. దీనిద్వారా (TCS iON Career Edge) ఉద్యోగం సంపాదించేందుకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు పేర్కొంది.

15 రోజుల శిక్షణ

ఈ ప్రోగ్రామ్​ (TCS iON Career Edge) కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. వారానికి కనీసం 7-10 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ కోర్స్ మొత్తం ఇంగ్లీష్​లో ఉంటుంది. అంతా ఆన్​లైన్​ ఫార్మాట్​.

ఎవరు అప్లై చెయొచ్చు?

అండర్​గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్​గ్రాడ్యుయేట్లు దీనికి అప్లై చేయొచ్చు. (TCS iON Digital Learning Hub)

ఏమేం నేర్పిస్తారు?

ఇందులో కమ్యూనికేషన్​ స్కిల్స్​, అకౌంటింగ్​, ఐటీ, కృత్రిమ మేధ వంటి అంశాల్లో ప్రాథమిక నైపుణ్యాలు పెంచుకోవచ్చని తెలిపింది టీసీఎస్​. (TCS iON Career Edge)

సర్టిఫికేట్ కూడా..

కోర్సు పూర్తైన తర్వాత ఎంతవరకు నేర్చుకున్నారనే అంశంపై అసెస్​మెంట్ ఉంటుంది. కోర్సు కాన్సెప్ట్​లపై అభ్యాసకుల అవగాహనను పరీక్షిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైతే.. (TCS iON Career Edge) కోర్సు పూర్తైన సర్టిఫికేట్ వస్తుంది. అనుమానాలను నివృతి చేసుకునేందుకు, సలహాలను కోరేందుకు డిజిటల్ డిస్కషన్ రూమ్ అందుబాటులో ఉంటుంది.

ఇదీ చదవండి:

డీమ్యాట్‌ ఖాతా​ తెరిచే ముందు ఇవి తెలుసుకోండి..

అమెజాన్​ ప్రైమ్​లో​ 'వీడియో ఛానల్స్'​- ఇక మరింత వినోదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.