corbevax news: బూస్టర్‌ డోసుగా 'కార్బెవ్యాక్స్‌' టీకా!

author img

By

Published : Oct 13, 2021, 7:05 AM IST

Corbevax as booster dose

'బూస్టర్‌ డోసు' కింద 'కార్బెవ్యాక్స్‌' టీకా(corbevax news) ఇచ్చే విషయమై, మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి హైదరాబాద్‌కు చెందిన బిఇ లిమిటెడ్‌.. భారత్‌ ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది. ఈ అంశాన్ని డీసీజీఐలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ తన తదుపరి సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు డోసుల కొవిడ్‌-19 టీకా తీసుకున్న వారికి 'బూస్టర్‌ డోసు' కింద 'కార్బెవ్యాక్స్‌' టీకా(corbevax news) ఇచ్చే విషయమై, మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి హైదరాబాద్‌కు చెందిన బిఇ లిమిటెడ్‌ భారత్‌ ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది. ఆర్‌బీడీ ప్రొటీన్‌ సబ్‌ యూనిట్‌ వ్యాక్సిన్‌ 'కార్బెవ్యాక్స్‌'పై(corbevax news) ప్రస్తుతం రెండో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు చివరి దశకు చేరుకున్నందుకు, జాప్యం లేకుండా మూడో దశ పరీక్షలు చేపట్టానికి బిఇ లిమిటెడ్‌ సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ కొంతకాలానికి శరీరం నుంచి యాంటీ-బాడీలు తగ్గిపోతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని, అందువల్ల వివిధ దేశాలు 'బూస్టర్‌ డోసు'ను అనుమతిస్తున్నాయని బిఇ లిమిటెడ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసుగా 'కార్బెవ్యాక్స్‌' టీకా(corbevax news) ఇవ్వడానికి అవసరమైన మూడో దశ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఈ కంపెనీ కోరింది.

మనదేశంలో 'బూస్టర్‌ డోసు'ను అనుమతించే అంశంలో శాస్త్ర పరిశోధనలను విశ్లేషిస్తున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్‌ పేర్కొన్నారు. 'కొవాగ్జిన్‌' టీకాను బూస్టర్‌ డోసుగా వినియోగించటానికి భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించింది. ఆ ఫలితాలను విశ్లేషించాల్సి ఉంది.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియా విక్రయంతో ప్రైవేటీకరణకు మరింత ఉతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.