లాన్ బౌల్స్​లో భారత్​కు స్వర్ణం.. కామన్​వెల్త్​లో తొలిసారి..

author img

By

Published : Aug 2, 2022, 7:00 PM IST

Updated : Aug 2, 2022, 7:20 PM IST

Commonwealth games 2022 Lawn Bowls Indian Women Fours team wins historic gold

18:55 August 02

లాన్ బౌల్స్​లో భారత్​కు స్వర్ణం.. కామన్​వెల్త్​లో తొలిసారి..

Lawn Bowls Commonwealth games: లాన్ బౌల్స్​లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. కామన్​వెల్త్ గేమ్స్​లో తొలిసారి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్​లో దక్షిణాఫ్రికాపై 17-10 తేడాతో గెలిచింది భారత్. లవ్లీ చౌబే, రూపా రాణి, పింకీ, నయన్​మోని సైకియాలతో కూడిన భారత లాన్ బౌల్స్ బృందం ఈ ఘనత సాధించింది. సోమవారం న్యూజిలాండ్‌ను ఓడించి వీరు ఫైనల్‌కు చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తుదిపోరులో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన ఈ బృందం ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం కొల్లగొట్టారు. దీంతో ఇప్పటివరకు భారత్‌ మొత్తం 10 పతకాలు సాధించింది. అందులో నాలుగు బంగారు పతకాలు కాగా, 3 రజతం, 3 కాంస్యాలు ఉన్నాయి.

ఎలా ఆడతారంటే?
లాన్ బౌల్స్ ఆటను 40-42 యార్డుల ఖాళీ స్థలంలో ఆడతారు. ఓ బాల్​ను.. దూరంగా ఉన్న చిన్న స్టేషనరీ బాల్​ వైపు దొర్లించడం ఈ ఆటలో ప్రధానం అంశం. జట్టులోని సభ్యులు.. 18వైపుల నుంచి బంతులను స్టేషనరీ బాల్ దొర్లించాల్సి ఉంటుంది. సింగిల్స్, పెయిర్స్, ట్రిపుల్, ఫోర్స్ అనే నాలుగు ఫార్మాట్లలో ఈ గేమ్ నిర్వహిస్తారు. జట్టులో ఎంతమంది సభ్యులు ఉన్నరనే అంశాన్ని బట్టి.. ఈ ఫార్మాట్​ను నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్.. ఫోర్స్ విభాగం(నలుగురు ఆడే ఫార్మాట్)లో స్వర్ణం గెలుచుకుంది.

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు

  • వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను (మహిళల 49 కిలోలు) బంగారు పతకం
  • జెరెమీ లాల్రిన్నుంగా (పురుషుల 67 కిలోలు) బంగారు పతకం
  • అంచిత షెలీ (పురుషుల 37 కిలోలు) బంగారు
  • సంకేత్ మహదేవ్ (పురుషుల55 కిలోలు) వెండి
  • బింద్యారాణి దేవి( మహిళల 55 కిలోలు) వెండి
  • గురురాజా పూజారి(61 కేజీలు పురుషుల) కాంస్యం
  • హర్జిందర్‌ కౌర్‌(మహిళల 71 కిలోలు) కాంస్యం
  • సుశీల దేవి( జూడో) వెండి పతకం, విజయ్‌ కుమార్‌( జూడో) కాంస్యం

ఇదీ చదవండి:

Last Updated :Aug 2, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.