ఆ ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధం: జయసుధ

author img

By

Published : Aug 9, 2022, 2:40 PM IST

Updated : Aug 9, 2022, 3:41 PM IST

Jayasudha

14:34 August 09

Actor Jayasudha: ఈనెల 21న భాజపాలో చేరడం లేదు: సినీనటి జయసుధ

Actor Jayasudha: భాజపా నేతలు తన ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధమన్న సినీనటి జయసుధ ప్రకటించారు. అయితే ఈ నెల 21 భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలను కోవడం లేదని తెలిపారు. ఈనెల 21 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు భాజపాలో చేరతారనే వార్తలపై ఆమె స్పందించారు.

అయితే భాజపాలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు సినీనటి జయసుధ వెల్లడించారు. తన ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దిల్లీ పెద్దలు మాట్లాడి హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు జయసుధ పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21 అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.

ఇవీ చదవండి: venkaiah naidu: పెద్దల సభకే 'సమయం' నేర్పిన నేత.. వెంకయ్యనాయుడు

నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు!.. మరి ప్రభుత్వం ఏర్పాటు ఎలా?

Last Updated :Aug 9, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.