బంగారం చోరీ నెపంతో మహిళపై నలుగురు కలిసి...

author img

By

Published : Sep 14, 2021, 6:16 PM IST

Yadagiri woman Rape case

మహిళను వివస్త్రను చేసి, లైంగికంగా వేధించిన కేసులో.. నిందితులపై 10 వేర్వేరు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఈ కేసుకు సంబంధించి వైరల్​ అయిన వీడియోలో.. సదరు మహిళ బంగారు ఆభరణాల చోరీకి పాల్పడినట్లు నిందితులు చెప్పటం వల్ల కేసును అన్నికోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక యాదగిరి జిల్లాలో ఓ మహిళను వివస్త్రను చేసి లైంగికంగా వేధించిన ఘటనపై విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులను అదే జిల్లాలోని షాహ్​పుర్​కు చెందిన నింగరాజా, శరణు, భీమశంకర్, అయ్యప్పగా గుర్తించారు. విచారణ అనంతరం.. అత్యాచారం, దాడి, బెదిరించటం వంటి 10 వేర్వేరు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Yadagiri woman Rape case
పోలీసుల అదుపులో నిందితులు

తనను ఏమీ చేయొద్దని బాధితురాలు వేధిస్తున్నట్లు వైరల్​ అయిన వీడియోలో ఉంది. అదే సమయంలో.. ఆమె బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతోందని నిందితులు చెబుతున్నారు. దీంతో ఈ కేసును అన్నికోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

"ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశాం. పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. వారంతా ఒకరికొకరు పరిచయం. ఓ చిన్నవ్యాపారం చేస్తున్నారు. అత్యాచారం సమయంలో ఉపయోగించిన కారు, మొబైల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నాం" అని డీఎస్పీ సీబీ వేదమూర్తి తెలిపారు.

ప్రస్తుతం బాధితురాలికి అన్నిరకాలుగా రక్షణ కల్పించామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సామాజిక, సంక్షేమ శాఖ నుంచి రూ.50వేలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25 వేలు పరిహారం అందించామన్నారు.

వైరల్ అయిన వీడియో 8 నెలల క్రితం నాటిది. ఇప్పుడా దృశ్యాలు వెలుగులోకి రాగా.. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండి: రెండేళ్లుగా పోలీస్ అత్యాచారం.. నదిలో దూకిన యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.