మద్యం ప్రియులకు గుడ్​ న్యూస్​.. కిరాణ షాపుల్లోనూ వైన్​!

author img

By

Published : Jan 27, 2022, 10:35 PM IST

Wines

wine sale in Maharashtra: మద్యం విక్రయాలకు ప్రత్యేకంగా షాపులు ఉంటాయి. వాటిల్లో తప్ప మరెక్కడా దొరకదు. అమ్మకూడదు కూడా. కానీ, మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కిరణా దుకాణాలు, సూపర్​ మార్కెట్లలోనూ వైన్​ విక్రయాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

wine sale in Maharashtra: మందు బాబులకు గుడ్​ న్యూస్​ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఇకపై కిరాణ దుకాణాలు, సూపర్​ మార్కెట్లలోనూ వైన్​ కొనుగోలు చేయొచ్చు. 1000 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణం కలిగిన కిరాణ దుకాణాలు, సూపర్​ మార్కెట్లో వైన్​ విక్రయాలకు అనుమతిస్తూ.. 'షెల్ఫ్​​ ఇన్​ షాప్​' పాలసీకి ఆమోదం తెలిపింది మాహారాష్ట్ర మంత్రివర్గం.

గత 20 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అమలులో ఉన్న పాలసీ ప్రకారం.. కేవలం లిక్కర్​ స్టోర్లలోనే వైన్​ విక్రయాలు జరపాలి. కానీ, ఆ పాలసీకి మార్పులు చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది మహా ప్రభుత్వం.

మంత్రివర్గం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మైనారిటీల అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్​ మాలిక్​.. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండ్ల ద్వారా తయారు చేసిన వైన్​ విక్రయాలు పెరగటం ద్వారా రైతులకు గరిష్ఠ ధరలు లభిస్తాయన్నారు. అందుకే సూపర్​ మార్కెట్లు, కిరాణ దుకాణాల్లో వైన్​ విక్రయాలకు అనుమతించినట్లు చెప్పారు. కొత్త పాలసీని భాజపా వ్యతిరేకించటంపై అడగగా.. అసలు భాజపాకు ఆ హక్కే లేదని తిప్పికొట్టారు మాలిక్​. హిమాచల్​ ప్రదేశ్​, గోవా వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పాలసీలే ఉన్నాయని గుర్తు చేశారు.

2020-21 లెక్కల ప్రకారం.. దేశంలో ఉత్పత్తి అవుతున్న విదేశీ మద్యం విక్రయాలు 200 మిలియన్​ లీటర్లకు చేరాయి. దేశీయ లిక్కర్​ 320 మిలియన్​ లీటర్లు, బీర్లు 30 కోట్ల లీటర్లుగా ఉండగా.. వైన్​ కేవలం 7 లక్షల లీటర్లుగానే ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 45 వైన్ తయారీ సంస్థలు ఉన్నాయి. అందులో 15 నుంచి 20 యూనిట్లు నేరుగా మార్కెటింగ్​ చేసుకుంటుండగా.. మిగిలినవి ఉత్పత్తికే పరిమితమయ్యాయి. దేశంలో వైన్​ పరిశ్రమ టర్నోవర్​ రూ.1,000 కోట్లకు చేరింది. అందులో 65 శాతం మహారాష్ట్ర నుంచే వస్తుండటం గమనార్హం. ఎక్కువగా నాశిక్​లోనే ఉన్నాయి. అక్కడి నుంచి 80 శాతం వైన్​ ఉత్పత్తి అవుతోంది. ఆ తర్వాత సంగ్లీ, పుణె, సోలాపుర్​, బుల్ధానా, అహ్మెదనగర్​లలో వైన్​ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: మహిళపై లైంగిక వేధింపులు- జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.