2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

author img

By

Published : Aug 20, 2022, 5:46 PM IST

Anurag and Manish Sisodia

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంపై జరిగిన సీబీఐ దాడుల్లో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని భాజపా విమర్శించింది. ఈ దాడుల విషయంలో కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉంటారని ఆరోపించింది. మరోవైపు, భాజపాపై విమర్శలు గుప్పించిన ఆప్.. కేజ్రీవాల్​కు భయపడే మోదీ.. సీబీఐతో దాడులు చేయిస్తున్నారని మండిపడింది.

Manish Sisodia on CBI raids: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంపై జరిగిన సీబీఐ దాడులు.. భాజపా, ఆప్‌ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. నూతన అబ్కారీ విధానంలో అవకతవకల గురించి తన నేతపై కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కుంభకోణంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సూత్రధారి అని.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు.

ఈ సీబీఐ దాడులతో ఆప్‌ ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందన్న కేంద్ర మంత్రి.. ఇతర విషయాలను లేవనెత్తి కుంభకోణాన్ని పక్కదోవ పట్టించవద్దన్నారు. సిసోదియా ఒక డబ్బు మనిషిగా ఆరోపించారు. సిసోదియా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నందునే.. సీబీఐ దాడుల సందర్భంగా మౌనంగా ఉన్నారని కేంద్ర మంత్రి విమర్శించారు.

అందుకే ఈ దాడులు
మరోవైపు, భాజపా ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సిసోదియా అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచి పనులు చేసినందుకు ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు.

"పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిచినప్పటి నుంచి ప్రధాని మోదీ.. పార్టీని చూసి భయపడుతున్నారు. 2024లో జరిగే లోక్​సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్​, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ నెలకొన్నందున..ఆప్​ను భయపెట్టడానికే ప్రధాని ఈ సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీని పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. దిల్లీలో విద్య, ఆరోగ్యం విషయంలో కేజ్రీవాల్ అవలంభిస్తున్న పద్ధతుల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అరవింద్ కేజ్రీవాల్​కు దేశ వ్యాప్త ఆదరణ పెరుగుతున్నందున.. తమని లక్ష్యంగా చేసుకుని.. ఈ దాడులకు పాల్పడుతున్నారు. సోదాలకు వచ్చిన అధాకారుల మా కుటుంబ సభ్యులతో మర్యాదగానే వ్యవహరించారు. పైనుంచి వారికి వచ్చిన ఆదేశాల ప్రకారం దాడులు చేశారు. హెల్త్ పోర్ట్‌ఫోలియో బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యేందర్ జైన్‌ను మొదట అరెస్టు చేశారు, మరో రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్టు చేస్తారు"
-మనీశ్ సిసోదియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి

ఇదిలా ఉండగా, దిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినీతి ఆరోపణల కేసులో పలువురికి సీబీఐ సమన్లు ​​జారీ చేసింది. ఈ పాలసీ అమలుకు సంబంధించిన కేసులో పలువురు నిందితులను సీబీఐ శనివారం విచారణకు పిలిచినట్లు అధికారులు తెలిపారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంతో సహా 31 చోట్ల సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఏజెన్సీ పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లతో పాటు బ్యాంకు లావాదేవీల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక మిగతా నిందితులకు సమన్లు ​​జారీ చేస్తామని చెప్పారు. బుధవారం ప్రత్యేక కోర్టులో నమోదైన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను మనీలాండరింగ్ ఆరోపణలపై విచారించే ఆర్థిక దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో కూడా పంచుకుంది.

ఇవీ చదవండి

ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్​ నుంచి మెసేజ్​

ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం, శిశువు మృతి, ఆ నిర్లక్ష్యంతోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.