నాటకంలో ఆ పాత్ర పోషిస్తే పిల్లలు పుట్టడం ఖాయమట!

author img

By

Published : Nov 23, 2022, 10:35 PM IST

tradition on ramayana janaka role

ఉత్తరాఖండ్​లో 55 ఏళ్లుగా ఓ వింత సంప్రదాయం కొనసాగుతోంది. రామాయణ నాటకంలో జనకుని వేషం వేస్తే పిల్లలు కలుగుతారని ఓ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు 18 మందికి ఇలాగే పిల్లలు పుట్టారని వారు చెబుతున్నారు.

రామాయణ నాటక ప్రదర్సన

రామాయణ గాథలో సీత తండ్రి జనకుని పాత్ర అందరికీ సుపరిచితమే. ఆ పురాణ చరిత్రలో జనకుడికి సంతానం కలగకపోతే ఆయన భార్య రత్నమాలతో కలసి ఓ యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ తర్వాత భూమిని దున్నడం ద్వారా ఆ దంపతులు సీతను పొందుతారు. ఈ జనకుని కథ ఆధారంగానే ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీ జిల్లా సంగ్రాలి అనే గ్రామంలో ఓ సంప్రదాయం పుట్టుకొచ్చింది. రామయణ చరిత్రలోని జనకుని పాత్ర పోషిస్తే.. సంతానం కలుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్ముతున్నారు. ఇప్పటి వరకు 18 మందికి ఇలాగే పిల్లలు పుట్టారని చెబుతున్నారు సంగ్రాలి ప్రజలు.

"నాకు పెళ్లి అయ్యి చాలా కాలం అయింది. అయినా పిల్లలు కలగలేదు. రామాయణంలో జనకుని పాత్ర పోషించిన తరువాత నాకు కుమార్తె జన్మించింది. జనకుని వేషధారణతో కచ్చితంగా పిల్లలు పుడతారు."
-సంతోష్​ సోమ్​వాల్​, మాజీ సైనికుడు

ఈ సంప్రదాయం సురేశానంద్ నౌటియల్ అనే వ్యక్తితో ప్రారంభం అయిందట. రామాయణంలో జనకుని పాత్ర పోషించాక అతడికి పిల్లలు పుట్టారన్నది గ్రామస్థుల మాట. అప్పటి నుంచి ఇలా చేస్తున్నామని, . పిల్లలు లేని వారికి మాత్రమే ఈ అవకాశం ఇస్తామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. పిల్లలు పుట్టాక.. జనకుని వేషధారి ఊరందరికీ తమ ఇంట్లో విందు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Ramlila in uttarakhand
రాయయణ నాటకం
Ramlila in uttarakhand
ఉత్తరాఖండ్​లో రామ్​లీల

"1967 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నాము. జనకుని వేషధారణ వల్ల ఆ భగవాన్ రామచంద్ర అనుగ్రహంతో పిల్లలు పుడతారని మా నమ్మకం. అందుకే ఈ కార్యక్రమం చేస్తాం. వేరే గ్రామస్థులు సైతం ఈ పాత్ర వేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. "
-శివానంద్​ భట్​, గ్రామస్థుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.