దళితుడి ఇంట్లో యోగి 'సంక్రాంతి విందు'- వారికి కౌంటర్!

author img

By

Published : Jan 14, 2022, 4:33 PM IST

Updated : Jan 14, 2022, 4:49 PM IST

CM Yogi Adityanath

UP CM Yogi Adityanath: ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో పర్యటించిన సందర్భంగా ఓ దళితుడి కుటుంబంతో కలిసి భోజనం చేశారు​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సంక్రాంతి సందర్భంగా భోజనానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ​

దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన యోగి ఆదిత్యనాథ్​

UP CM Yogi Adityanath: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ మకర సంక్రాంతి సందర్భంగా గోరఖ్​పుర్​లో పర్యటించారు. ఓ దళితుడి ఇంటికి వెళ్లి వారితో పాటు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సమాజ్​వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎస్పీ అధికారంలో దళితులు సామాజిక బహిష్కరణకు గురయ్యారని, సామాజిక న్యాయమనేదే లేదని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ఎలాంటి వివక్ష లేకుండా కృషి చేస్తోందన్నారు.

CM Yogi Adityanath
దళిత కుటుంబంతో యోగి భోజనం

భాజపా ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని విమర్శలు చేస్తూ స్వామి ప్రసాద్​ మౌర్య, దారా సింగ్​ చౌహాన్​, ధరమ్​ సింగ్​ సైనీ శుక్రవారం సమాజ్​వాదీ పార్టీలో చేరిన క్రమంలో.. దళితుడి ఇంట్లో యోగి భోజనం చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

గోరఖ్​పుర్​లోని దళిత వర్గానికి చెందిన అమృత్​లాల్​ ఇంట్లో భోజనం చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు సీఎం యోగి. అఖిలేశ్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

CM Yogi Adityanath
విలేకరులతో మాట్లాడుతున్న యోగి ఆదిత్యనాథ్​

" అఖిలేశ్​ యాదవ్​​ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో.. ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద 18వేల ఇళ్లు మాత్రమే ప్రజలకు ఇచ్చారు. కానీ, భాజపా ప్రభుత్వం ఇప్పటి వరకు 45 లక్షల ఇళ్లను పేదలకు ఇచ్చింది. ఎస్పీ ప్రభుత్వ హయంలో జరిగింది సామాజిక బహిష్కరణే కానీ, సామాజిక న్యాయం కానేకాదు. ప్రస్తుత డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వంలో ఉజ్వల యోజన కింద 1.36 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. 2.61 కోట్ల కుటుంబాలకు శౌచాలయాలు నిర్మించాం. వారసత్వ రాజకీయాల చేతిలో ఉన్నవారు ఎప్పటికీ సమాజంలోని ఏ ఒక్కరికీ న్యాయం చేయలేరు. దళితులు, పేదవారి హక్కుల పట్ల ఎస్పీ ప్రభుత్వం దోపిడికి పాల్పడింది."

- యోగి ఆదిత్యనాథ్​, యూపీ ముఖ్యమంత్రి.

ప్రియాంక గాంధీపై భాజపా విమర్శలు

మరోవైపు.. ఓ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్​ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పించింది భాజపా. ఆమె సెలెక్టివ్​ పాలిటిక్స్​ చేస్తున్నారని, మహిళలపై జరిగే అఘాయిత్యాలను తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించింది. ఉత్తర్​ప్రదేశ్​లో మహిళల కోసం పోరాడతానంటూ నినదిస్తున్న ప్రియాంక.. రాజస్థాన్ వంటి కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో పట్టించుకోవటం లేదని భాజపా ప్రతినిధి సంబిత్​ పాత్ర విమర్శించారు. కాంగ్రెస్​ రాజకీయ నేత కాబట్టి రాజకీయాలే చేస్తారని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి:

యోగి సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ రేట్లలో 50 శాతం కోత!

'యూపీలో భాజపాకు మూడు లేదా నాలుగు సీట్లే!'

Last Updated :Jan 14, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.