భాజపా అభ్యర్థికి షాక్- ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు!

author img

By

Published : Oct 12, 2021, 4:59 PM IST

tn bjp

తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు(tn local body election results).. ఓ భాజపా అభ్యర్థికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి(bjp tamil nadu news). కోయంబత్తూర్​లో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన ఆయనకు ఒక్కటే ఓటు దక్కింది. ఆయన కుటుంబసభ్యులు మొత్తం ఐదుగురు ఉన్నా.. ఆయనకు ఒక్కటే ఓటు పడింది. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో(tn local body election results 2021) ఓ భాజపా అభ్యర్థికి గెట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఆయనకు ఒక్కటంటే.. ఒక్కటే ఓటు దక్కింది(bjp tamil nadu news). ఆయన కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నా ఒక్క ఓటే పడటం వల్ల ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ నెల 6,9 తేదీల్లో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 27,003 వార్డుల నుంచి 79,433 మంది పోటీపడ్డారు. అందులో డి.కార్తిక్​ ఒకరు. కోయంబత్తూర్​ జిల్లాలోని పెరియనైకెంపాలెం నుంచి వార్డు సభ్యుడిగా భాజపా టికెట్​పై పోటీచేశారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఐదుగురికి ఓటు హక్కు ఉంది. చివరకు ఎన్నికల ఫలితాలు రాగా.. కేవలం ఒక్క ఓటే ఆయనకు పడిందని తేలింది.

ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వ్యవహారంపై ట్విట్టర్​లో కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఒక్క ఓటే వచ్చింది. ఆయనకు కాకుండా.. వేరే వారికి ఓటు వేసిన ఆయన కుటుంబసభ్యులను చూస్తే గర్వంగా ఉంది."

-- మీనా కందసామి, రచయిత్రి.

"ఆయన కుటుంబంలో ఐదుగురు ఉన్నారు. కానీ కోయంబత్తూర్​లో ఆయనకు ఒక్కటే ఓటు పడింది. తమిళనాడులో భాజపా పరిస్థితి ఇంతే."

-- అశోక్​ కుమార్​, కాంగ్రెస్

ఎన్నికల వేళ కార్తిక్​ విడుదల చేసిన పోస్టర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్​షాతో పాటు మరో ఏడుగురు నేతలున్నారని.. కనీసం 7 ఓట్లు కూడా పడలేదని ఒకరు ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:- భాజపాకు షాక్​.. కాంగ్రెస్​లోకి ఉత్తరాఖండ్​ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.