TS HC on Group1 Prelims Exam : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

author img

By

Published : May 25, 2023, 4:43 PM IST

Updated : May 25, 2023, 6:51 PM IST

TS HC on Group1 Prelims Exam

16:39 May 25

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

TS HC on Group 1 Prelims Exam : రాష్ట్రంలో జూన్‌ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్‌లపై నేడు విచారణ జరపగా.. వివిధ పరీక్షల మధ్య వ్యవధి నిబంధన పాటించట్లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్లు వేయాలని హోంశాఖ కార్యదర్శి, సిట్‌ను ఆదేశించింది. ఈ మేరకు స్టేకు నిరాకరిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

నా బిడ్డా పరీక్ష రాస్తుంది..: అంతకుముందు ఇదే పిటిషన్‌పై వెకేషన్‌ కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్.. తన కుమార్తె కూడా గ్రూప్‌-1 పరీక్ష రాస్తున్నందున పిటిషన్​ను విచారించలేనని తెలిపారు. మధ్యాహ్నం మరో బెంచ్​కు పంపిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తీక్‌.. పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.

గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్​ను నిర్వహించింది. ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులంతా మెయిన్స్‌ పరీక్షల కోసం సన్నద్ధమవుతుండగా.. మార్చి నెలలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా పలు పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ రద్దు చేసింది. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా గ్రూప్‌-1 పరీక్షను జూన్ 11న నిర్వహించేందుకు నిర్ణయించింది.

మరో 2 నెలలు వాయిదా వేయాలి..: ఈ క్రమంలోనే గ్రూప్‌-1 పరీక్షలను కనీసం మరో 2 నెలలు వాయిదా వేయాలని కోరుతూ సుమారు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా టీఎస్​పీఎస్సీ చట్టం ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల మధ్య తగినంత విరామం ఉండేలా నిర్వహించాల్సి ఉందని.. ఈ మేరకు ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీకి ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ నిబంధనకు విరుద్ధంగా టీఎస్​పీఎస్సీ వ్యవహరిస్తోందని పిటిషనర్లు వాదించారు.

స్టే విధించండి..: పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ ఛైర్మన్, కార్యదర్శికి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రిలిమ్స్ నిర్వహణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణపై స్టేకు నిరాకరించింది.

ఇవీ చూడండి..

TS HC on Group1 Prelims Exam : 'నా బిడ్డ గ్రూప్1 పరీక్ష రాస్తోంది.. ఈ పిటిషన్​ను నేను విచారించలేను'

TSPSC PAPER LEAK UPDATE: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో మరో ముగ్గురు అరెస్టు

Last Updated :May 25, 2023, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.