ETV Bharat / bharat

Viveka murder case : అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిష‌న్ విచారణకు సుప్రీం నిరాకరణ

author img

By

Published : May 22, 2023, 11:57 AM IST

Updated : May 22, 2023, 12:39 PM IST

సుప్రీం కోర్టులో అవినాష్ కు చుక్కెదురు
సుప్రీం కోర్టులో అవినాష్ కు చుక్కెదురు

11:53 May 22

కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

avinash reddy supreme court : కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిష‌న్ విచారణకు సుప్రీం వెకేషన్‌ బెంచ్‌ నిరాకరించింది. మెన్షనింగ్‌ లిస్టులో ఉంటేనే విచారిస్తామ‌ని జస్టిస్‌ అనిరుధ్ బోస్, జస్టిస్‌ సంజ‌య్ క‌రోల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మెన్షనింగ్‌ అధికారి ముందుకెళ్లాల‌ని సూచించిన జస్టిస్‌ అనిరుధ్ బోస్ ధర్మాస‌నం.. జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్‌ రాకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు మెన్షనింగ్‌ అధికారికి సూచించింది.

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది వెకేష‌న్ బెంచ్ జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ నరసింహ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. కాగా, పిటిషన్‌ తమ ముందుకు విచారణకు రావట్లేదని చెప్పిన ద్విసభ్య ధర్మాసనం.. మరో వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వెళ్లాలని సూచించింది. దీంతో జస్టిస్‌ అనిరుధ్ బోస్, జస్టిస్‌ సంజ‌య్ క‌రోల్‌ ధర్మాసనం ముందుకు వెళ్లగా... మెన్షనింగ్‌ లిస్టులో ఉంటేనే విచారిస్తామ‌ని స్పష్టం చేస్తూ విచారణకు నిరాకరించింది.

మరో సారి సుప్రీంకోర్టుకు.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై అవినాష్‌ రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు వెకేష‌న్ బెంచ్‌ విచారించేలా ఆదేశించాల‌ని కోరారు. సుప్రీంకోర్టు విచార‌ణ తేదీని ఖ‌రారు చేయ‌కపోవడంతో జూన్ రెండో వారంలో విచార‌ణ‌కు అనుమ‌తిస్తామ‌ని సీజేఐ ధ‌ర్మాస‌నం వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యాన సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్నందున అవినాష్‌ తరఫు లాయర్‌ మ‌ళ్లీ మెన్షన్‌ చేశారు. హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసేంత‌ వ‌ర‌కూ త‌న‌ను సీబీఐ అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని సుప్రీంను కోరారు. తిరిగి రేపు మరోసారి సుప్రీం కోర్టు వెకేష‌న్ బెంచ్ ముందుకు వెళ్లాల‌ని అవినాశ్‌ రెడ్డి భావిస్తున్నారు.

తల్లికి అనారోగ్యం.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి... ఈనెల 22న విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. కాగా, తన తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కావడం లేదని.. మరింత గడువు కావాలని కోరుతూ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఛాతీలో నొప్పి కారణంగా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఈనెల 19 నుంచి చికిత్స పొందుతున్నారు. వైద్యులు వివిధ రకాల పరీక్షలు, యాంజియోగ్రామ్ కూడా చేశారు. అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలో తల్లితో పాటే అక్కడే ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తల్లిని వదిలి విచారణకు రాలేనని పేర్కొంటూ... విచారణకు హాజరు కాలేకపోతున్నానని సీబీఐకి రాసిన లేఖలో వెల్లడించారు. తన తల్లి విశ్వ భారతి ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. తన తల్లి డిశ్చార్జ్ కావడానికి దాదాపు పది రోజులు సమయం పడుతుందని తెలిపారు.

కర్నూలులో హై టెన్షన్... కర్నూలులో వేకువజాము నుంచే ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు సీబీఐ అధికారులు... వేకువజాము నుంచి కర్నూలులోనే ఉండిపోయారు. సీబీఐ అధికారుల రాకతో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అవినాష్‌ను అరెస్టు చేస్తే అడ్డుకోవాలని ఆయన అనుచరులు యత్నిస్తుండగా.. శాంతిభద్రతల అంశంపై పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు జరిపారు. లొంగిపోవాల్సిందిగా అవినాశ్‌కు చెప్పాలని ఎస్పీకి సీబీఐ సూచించినట్లు సమాచారం.

ఇవీ చదవండి :

Last Updated : May 22, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.