మరోసారి సోనుసూద్ దాతృత్వం.. బిక్షాటన చేస్తున్న సింగర్​కు ఉద్యోగ హామీ

author img

By

Published : Nov 18, 2022, 11:05 PM IST

sonusood helped idol singer Maqsood

సోనుసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఝార్ఖండ్ వీధుల వెంట బిక్షాటన చేస్తున్న ఇండియన్​ ఐడియల్​ సింగర్​కు ఉద్యోగం ఇచ్చేందుకు హామి ఇచ్చారు.

ఐడల్​ సింగర్ మక్సూద్

బాలీవుడ్​ స్టార్​ సోనూసుద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే కరోనా సమయం నుంచి ఎన్నో లక్షల మందికి అండగా నిలిచిన ఆయన.. తాజాగా భిక్షాటన చేస్తూ జీవినం సాగిస్తున్న దివ్యాంగుడైన ఇండియన్​ ఐడల్ సింగర్​కు​ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఓ ప్రైవేటు స్కూల్​లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని హామి ఇచ్చారు.ఝార్ఖండ్​కు చెందిన మక్సూద్ అనే దివ్యాంగుడు.. 2017 ఇండియన్​ ఐడల్​ సింగర్ పోటీల్లో సైతం పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం తన పరిస్థితి బాగో లేక ​బొకారో జిల్లాలో వీధుల వెంట భిక్షాటన చేస్తూ జీవినం సాగిస్తున్నారు. తన గాత్రాన్ని ప్రజలకు వినిపిస్తు సాయం కోసం కోరుతున్నారు. దీంతో అతడి గురించి సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

sonusood helped idol singer Maqsood
ట్వీట్​
అయితే ఇది బాలీవుడ్​ స్టార్​ సోనూసుద్​ సహా ఆ రాష్ట్ర మంత్రి చంపాయ్​ సోరెన్​ల దృష్టికి వెళ్లింది. దీంతో వారిద్దరూ మక్సూద్​కు ​సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సోనుసూద్.. మక్సూద్​కు ఓ ప్రైవేటు స్కూల్​లో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి చంపాయ్​ సోరెన్ కూడా మక్సూద్​కు ప్రభుత్వం సాయం అందేలా చూడాలని జిల్లా డీసీని ఆదేశించారు.

'సోనుసూద్ నుంచి ఉద్యోగ ఆఫర్​ వచ్చింది నిజమే. జీతం విషయంలో ఇంకా తెలియాల్సి ఉంది. సంగీతంతో జీవించడమే నా కల, మళ్లీ ఇండియన్​ ఐడల్​ సింగర్ షో​లో పాల్గొనాలని ఆశగా ఉంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి పురస్కారాలు అందుకోవాలని ఉంది. 2017లో​ ఇండియన్​ ఐడల్​ సింగర్ షోలో 24వ రౌండ్ వరకు వెళ్లగలిగాను. తరువాత ఇండియన్​ ప్లే బ్యాక్​ సింగర్​ సురేశ్​ వాడేకర్​ వద్ద పాడటంలో మెలుకువలు నేర్చుకున్నా. కరోనా కారణంగా ఇంటికి తిరిగివచ్చాను. ప్రస్తుతం నా సహచరులతో ఉదయం బొకారో నగరానికి వచ్చి పలు విధుల్లో భిక్షాటన చేసి సాయంత్రం ఇంటికి వెళ్తున్నా'
-- మక్సూద్, దివ్యాంగుడు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.