యువకుడ్ని వెంటాడుతున్న పాము.. 10 రోజుల్లో 5 కాట్లు.. ప్రతిసారీ అక్కడే...

author img

By

Published : Sep 16, 2022, 11:01 AM IST

Updated : Sep 16, 2022, 11:16 AM IST

snake bites man for five times

10 రోజుల్లోనే 5 సార్లు పాము కాటుకు గురయ్యాడు ఓ యువకుడు. అన్నిసార్లూ ఒకే పాము తనను కాటేసిందని, అది కూడా ఎడమ కాలిపైనే అని అతడు చెబుతున్నాడు. సమయానికి వైద్యం అంది, అతడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతోందనని ఆ యువకుడు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఓ యువకుడ్ని 10 రోజుల్లో 5 సార్లు విష సర్పం కాటేయడం.. ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రా జిల్లాలో చర్చనీయాంశమైంది. మల్​పురా ప్రాంతంలోని మన్​కేఢా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రజత్ చాహర్.. ఐదు సార్లు ప్రాణాలతో బయయపడ్డాడు. అసలు ఆ పాము తనను ఎందుకు వెంటాడుతోందో, ప్రతిసారీ ఎడమ కాలిపైనే కాటేయడానికి కారణమేంటో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సెప్టెంబర్ 6న మొదలు..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మన్​కేఢా గ్రామానికి చెందిన రామ్​ కుమార్​ చాహర్ తనయుడైన రజత్ చాహర్.. డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6న రాత్రి 9 గంటలకు ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ పాము అతడి ఎడమ కాలిపై కాటేసింది. భయంతో రజత్ గట్టిగా అరిచాడు. ఇంట్లోని వాళ్లు వచ్చేసరికి పాము వెళ్లిపోయింది. హుటాహుటిన అతడ్ని నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత కాసేపటికి ఎస్​ఎన్​ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. 4 గంటలపాటు అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షించారు. పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని రజత్​ను ఇంటికి పంపేశారు.

snake bites man for five times
రజత్ చాహర్

సెప్టెంబర్ 8న సాయంత్రం ఇంటి బయట ఉన్న బాత్రూమ్​కు వెళ్లాడు రజత్. అప్పుడు అతడి ఎడమ కాలిపై మరోసారు పాము కాటేసింది. రజత్​ను హుటాహుటిన ముబారక్​పుర్​ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర చికిత్స చేయించారు. అయినా ఆ పాము అతడ్ని విడిచి పెట్టలేదు. ఈనెల 11న ఇంట్లోని ఓ గదిలో ఉండగా; ఈనెల 13న బాత్రూమ్​లో ఉండగా; ఈనెల 14న చెప్పులు వేసుకుంటుండగా రజత్​ను పాము కరిచింది. ప్రతిసారీ కుటుంబ సభ్యులు అతడ్ని తీసుకెళ్లి చికిత్స చేయించారు. రజత్​ను 'పాము వెంటాడడం' గురించి మన్​కేఢా గ్రామస్థులు జోరుగా చర్చించుకుంటున్నారు. అనేక మంది అతడి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

snake bites man for five times
రజత్ చాహర్​కు గ్రామస్థుల పరామర్శ
snake bites man for five times
కుటుంబ సభ్యులు, స్నేహితులతో రజత్ చాహర్

మరోవైపు.. కాటేసిన పాముపై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ వ్యక్తి. దానిని నోటితో కరిచి చంపేశాడు. చనిపోయిన సర్పాన్ని మెడలో వేసుకుని ఊరంతా షికార్లు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కర్ణాటకకు చెందిన లోకేశ్​ది మరో కథ. వన్యప్రాణుల ప్రేమికుడైన లోకేశ్​​ ఇప్పటివరకు సుమారు 35,000 పాములను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. అయితే.. ఇటీవల నాగుపామును సంరక్షించే క్రమంలో కాటుకు గురై, చికిత్స పొందుతూ మరణించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated :Sep 16, 2022, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.