చెత్త కుప్పలో అస్థిపంజరాలు, ఎముకలపై ఇంగ్లిష్​లో పేర్లు, ఏంటి కథ

author img

By

Published : Aug 20, 2022, 9:25 PM IST

Updated : Aug 21, 2022, 6:17 AM IST

A Bag full of skeletons

ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా ఓ బ్యాగ్​ తీవ్ర కలవరం రేపింది. బ్యాగ్ ​నిండా అస్థిపంజరాలు బయటపడడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Skeleton bag in Bengal: బంగాల్​ సిలిగుడి ప్రాంతం నక్సల్బరీ మార్కెట్​లో అస్థిపంజరాలతో కూడిన బ్యాగ్ దొరకడం స్థానికంగా కలవరం రేపింది. చౌరింగ్గీ మార్కెట్‌ ప్రాంతంలోని బంగారు నగల దుకాణం వెనుక ఉన్న చెత్త కుప్ప సమీపంలో స్థానిక నివాసి మలవిసర్జనకు వెళ్లగా.. అక్కడ ఒక బ్యాగ్​ నిండా అస్థిపంజరాలు ఉండడాన్ని గమనించాడు. ఆ విషయాన్ని స్థానిక వ్యాపారులకు చెప్పాడు. దీంతో విషయం చుట్టుపక్కల ప్రజలకు వ్యాపించింది. అస్థిపంజరాల సంచిని చూసి స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు.

A Bag full of skeletons
అస్థిపంజరాలు

కాగా, ఈ సమాచారాన్ని దగ్గరో ఉన్న నక్సల్బరీ పోలీస్టేషన్​కు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగ్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరాలను పరీక్షల నిమిత్తం ఉత్తర బంగాల్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డార్జీలింగ్ డీఎస్​పీ అచింత్య గుప్తా మాట్లాడుతూ.. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపడతామన్నారు.

ఆ సంచిలో పుర్రె, వెన్నెముకలు, కాళ్లుచేతుల ఎముకలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుడు బిశ్వజిత్ మండల్ మాట్లాడుతూ.. అ అస్థిపంజరాలపై ఇంగ్లిష్​ అక్షరాలతో పేర్లు రాసి ఉన్నాయన్నారు. మార్కెట్​ మధ్యలో ఈ అస్థిపంజరాల సంచి బయటపడడం వల్ల స్థానిక వ్యాపారస్థులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇవీ చదవండి

విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్​కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ

కాటన్​కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్​సీ సిబ్బంది నిర్లక్ష్యం

Last Updated :Aug 21, 2022, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.