హిందూ మహాసభ నాయకుడు వీడీ సావర్కర్‌పై 8వ తరగతి పుస్తకంలో కొత్తగా చేర్చిన పాఠం కర్ణాటకలో వివాదాస్పదమైంది జైలులో బంధీగా ఉన్న సావర్కర్ బుల్బుల్ పిట్ట రెక్కలపై కూర్చుని బయటకు వెళ్లేవారని అందులో ఉండడం చర్చనీయాంశమైందిSavarkar bird వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అండమాన్ సెల్యూలర్ జైలులో బంధించారు ఆయన ఉన్న గదికి ఒక చిన్న రంధ్రం కూడా ఉండేది కాదు కానీ ఆ గదికి బుల్బుల్ పిట్టలు వచ్చేవి సావర్కర్ వాటి రెక్కలపై కూర్చుని రోజూ తన మాతృభూమికి వెళ్లి వచ్చేవారు కర్ణాటకలో 8వ తరగతి విద్యార్థుల పాఠం ఇది ఆశ్చర్యంగా ఉందా అందుకే ఇది నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది ఇదీ సంగతి పాఠ్యపుస్తకాల పునఃసమీక్షకు కొంతకాలం క్రితం ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం రోహిత్ చక్రతీర్థ కమిటీ ఈ ఏడాది ఆ బాధ్యతలు చేపట్టింది 8వ తరగతి కన్నడ టెక్స్ట్ బుక్‌లో గతంలో విజయమాల రాసిన బ్లడ్ గ్రూప్ అనే పాఠం తీసేసి కాలవాను గెడ్డవారుకాలాన్ని గెలిచినవారు పేరిట సరికొత్త పాఠం ప్రవేశపెట్టింది స్వయంగా అండమాన్ సెల్యూలర్ జైలును చూసొచ్చిన కేకే గట్టి తన అనుభవాలను వివరిస్తూ రాసిన పాఠం అది బుల్బుల్ పిట్టపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయం 8వ తరగతిలో పాఠంహిందూ మహాసభ నాయకుడు వీడీ సావర్కర్ జీవితంపై స్కూల్ బుక్‌లోని ఈ పాఠం సర్వత్రా చర్చనీయాంశమైంది ఆయన జీవితాన్ని అతిశయోక్తిలా చెప్పారని నెటిజన్లు విమర్శలు చేశారు సావర్కర్ అసలు స్వాతంత్ర్య సమరయోధుడే కాదని వాదించే ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుబట్టింది భాజపా మాత్రం సమర్థించింది బుల్బుల్ పిట్టపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయం 8వ తరగతిలో పాఠంKarnataka Savarkar issue కర్ణాటక రాజకీయాలు కొంతకాలంగా సావర్కర్ చుట్టూ తిరుగుతున్నాయి ఇటీవల ఆయన ఫొటోలతో రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టడం వాటిని తొలగించడం హింసకు దారితీసింది మరోవైపు తుమకూరు విశ్వవిద్యాలయం అంగీకరిస్తే వర్సిటీలో సావర్కర్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆదివారం ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరకట్నంతో లాభాలపై విద్యార్థులకు పాఠాలు