ట్రెండ్ మార్చిన సాధువులు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు

author img

By

Published : May 14, 2022, 1:33 PM IST

sadhu-saints meeting-at-hotel

Sadhu saints: సాధువులు ట్రెండ్ మార్చారు. మఠాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్​లో అఖిల భారతీయ అఖాడా పరిషత్​ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Sadhu saints meeting: కాలంతో పాటు ప్రపంచమూ మారుతోంది. ప్రజలు కూడా ఆధునిక జీవనానికి అలవాటుపడుతున్నారు. అత్యాధునిక సాంకేతికత, విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో సాధువులు కూడా చేరారు. సాధారణంగా మఠాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సమావేశమయ్యే వీరు.. ఇప్పుడు ఫైవ్​ స్టార్ హోటళ్లలో భేటీ అవుతున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని క్లాసిక్​ రెసిడెన్సీ హోటల్​లో అఖిల భారతీయ అఖాడా పరిషత్​కు చెందిన సాధువులు ఇటీవలే ఓ సమావేశం ఏర్పాటు చేశారు. చార్​ధామ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారనే విషయం పక్కనపెడితే.. ఇందుకు సంబంధించిన ఫొటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

sadhu-saints meeting-at-hotel
ఫైవ్ స్టార్ హోటల్​లో సమావేశమైన సాధువులు

సోషల్ మీడియా ఎఫెక్ట్​: సామాజిక మాధ్యమాల రాకతో చాలా మార్పు వచ్చింది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తాము ఎక్కడకు వెళ్లేది, ఏం చేస్తున్నది ఫొటోలు షేర్ చేసి మరీ మిత్రులు, సన్నిహితులతో పాటు అందరికీ తెలిసేలా పోస్టులు పెడుతున్నారు. సాధువులు కూడా ఈ సోషల్ మీడియాను చక్కగా వినియోగించుకుంటున్నారు. దాదాపు అన్ని మఠాల వారు ట్విట్టర్, ఫేస్​బుక్​లో చురుగ్గా ఉంటూ.. భక్తులకు దగ్గరయ్యారు. తమకు సంబంధించిన విషయాలను ఫొటోలు, వీడియో సందేశాల ద్వారా షేర్ చేస్తున్నారు.

sadhu-saints meeting-at-hotel
ఫైవ్ స్టార్ హోటల్​లో సాధువులు

Saints meeting in Hotel: హరిద్వార్​ హోటల్​లో నిర్వహించిన సమావేశంలో అఖిల భారత అఖాడా పరిషత్​​ అధ్యక్షుడు, శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాని సెక్రెటరీ శ్రీ మహంత్​ రవీంద్రపురి మహరాజ్​ ప్రసంగించారు. సనాతన ధర్మం, సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చార్​ధామ్ యాత్ర తెలియజేస్తుందన్నారు. విదేశీయులు కూడా సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. చార్​ధామ్​ యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్ని ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. మోదీకి ఈ దేవభూమితో ప్రత్యేక అనుబంధముందన్నారు.

sadhu-saints meeting-at-hotel
ట్రెండ్ మార్చిన సాధువులు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు

ఇదీ చదవండి: భారీ బందోబస్తు నడుమ.. జ్ఞాన్​వాపీ మసీదు సర్వే షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.