విషం తాగి అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నం.. పోలీసుల తీరే కారణమా?

author img

By

Published : Jun 24, 2022, 10:43 AM IST

crime news

పోలీసుల తీరుపై విసుగు చెందిన ఓ అత్యాచార బాధితురాలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఓ పోలీస్​ పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇటీవలే అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేయకపోవడం వల్లే బాధితురాలు.. ఇలా చేసినట్లు తెలుస్తుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు షాహిద్‌పై కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ దినేష్ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు.

పెళ్లి పేరుతో పోలీస్ అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఓ మహిళ పై అత్యాచారం చేశాడు పోలీస్​. ఆ తర్వాత ఎన్ని రోజులైనా పెళ్లిపై అతడు నోరు విప్పకపోవడం వల్ల బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.
పోలీసులు వివరాలు ప్రకారం.. మూడేళ్ల క్రితం బాధితురాలు తన భర్తపై ఫిర్యాదు చేయడానికి ఓ సారి పోలీస్​స్టేషన్​కు వచ్చింది. ఆ సమయంలో నిందితుడికి, బాధితురాలికి పరిచయం ఏర్పిడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్థానిక లాడ్జిలో ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. అలా కొన్ని నెలలు జరిగినా.. అతడు పెళ్లి విషయంపై స్పందించకపోవడం వల్ల ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఏడేళ్ల బాలికపై టీచర్​ అత్యాచారం.. ఉత్తర్​ప్రదేశ్​లోని సహరన్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయిడే.. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బుధవారం తన కుమార్తెపై మదర్సా టీచర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ బాలిక తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ సూరజ్ రాయ్ చెప్పారు. ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెబితే చంపేస్తానని కూడా నిందితుడు బెదిరించారని రాయ్ అన్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

ఇవీ చదవండి: కరోనా కలవరం.. భారీగా పెరిగిన కేసులు.. మరో 17వేల మందికి వైరస్​

పెట్టుబడుల పేరుతో ఆన్​లైన్​లో​ ఘరానా​ మోసం.. రూ.300 కోట్లు టోకరా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.