గుడికెళ్లి వస్తూ లోయలో పడ్డ ట్రాక్టర్​.. 8 మంది మృతి.. 26 మందికి గాయాలు

author img

By

Published : May 29, 2023, 9:48 PM IST

Updated : May 29, 2023, 10:53 PM IST

rajasthan-road-accident-several-killed-tractor-trolley-falls-into-gorge

Rajasthan Road Accident : రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్​ బోల్తా పడింది. ఘటనలో 8 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. మరోవైపు ఓ వాహనం అదుపు తప్పి చినాబ్​ నదిలో లోయలో పడింది. జమ్ము కశ్మీర్​లో ఈ ఘటన జరిగింది.

Rajasthan Road Accident : గుడికి వెళ్లి వస్తుండగా ఓ ట్రాక్టర్​ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆగుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. రాజస్థాన్​లో ఈ ఘటన జరిగింది. జుంజును జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

సోమవారం స్థానికంగా ఓ కొండపై ఉన్న మన్​సా మతా ఆలయంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున పుజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో చుట్టుపక్క ప్రాంతాల భక్తులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. అనంతరం తిరిగి వెళుతుండగా.. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గుడికి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉందని స్థానికులు వెల్లడించారు. మొదట ట్రాక్టర్​ అదుపుతప్పి ఉండవచ్చని, ఆ తర్వతా స్తంభానికి ఢీకొని లోయలో పడొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

అదుపు తప్పి చినాబ్​ నదిలో లోయలో పడ్డ వాహనం..
జమ్ము కశ్మీర్​లో ఓ వాహనం అదుపు తప్పి చినాబ్​ నదిలో లోయలో.. 300 అడుగుల లోతులో పడింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఇంకో వ్యక్తి గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం డొడా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బటోట్-కిష్త్వార్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. డొడా నుంచి వాహనం జమ్ముకు వెళుతుందని.. అదే సమయంలో రగ్గి నల్లా వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని వారు వెల్లడించారు. ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్​టేక్​ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను వెలికి తీసి.. అనంతరం వాటిని స్థానిక ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

ఒకే కుటుంబంలో 10 మంది మృతి.. మైసూర్​ ట్రిప్​లో విషాదం..
Mysore Accident Today : కర్ణాటకలో ఓ కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మైసూరు జిల్లాలోని టి.నరసిపుర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated :May 29, 2023, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.