ఉద్యోగం కోసం దారుణం.. మూడు నెలల చిన్నారిని నదిలో పడేసిన తల్లిదండ్రులు

author img

By

Published : Jan 24, 2023, 12:37 PM IST

father kills her daughter

ఉద్యోగం పోతుందనే భయంతో మూడు నెలల పసికందును నదిలో పడేశారు ఆమె తల్లిదండ్రులు. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. మరోవైపు, భార్యపై కోపంతో నాలుగేళ్ల కుమార్తెను హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

రాజస్థాన్​ బికానేర్​లో దారుణం జరిగింది. మూడు నెలల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు కాలువలో పడేశారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకోవడం వల్ల.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. పోలీసులు.. నిందితులను అదుపులోకి దర్యాప్తు చేయగా పలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

"నిందితుడు చందాసర్​లో ఓ స్కూల్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడు. అతడు కాంట్రాక్ట్ ఉద్యోగి. తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని అఫిడవిట్ సమర్పించాడు. మూడో బిడ్డ ఉందని తెలిస్తే ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. ఈ కారణంగా దంపుతులిద్దరూ మూడు నెలల ఆడబిడ్డను ఇందిగాగాంధీ కాలువలో పడేశారు. నిందితులు ఝన్వర్​లాల్​, గీతా దంపతులను అరెస్ట్ చేశాం."

--పోలీసులు

father kills her daughter
నిందితులు

భార్యపై కోపంతో కుమార్తె హత్య..
బిహార్ సహర్సాలో దారుణం జరిగింది. భార్యపై కోపంతో నాలుగేళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం చిన్నారి మృతదేహాన్ని వాగులో పడేశాడు. మళ్లీ మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంటి ఆవరణలో పాతిపెట్టాడు. నిందితుడు రాజ్​కుమార్ సాహ్నిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి మృతదేహాన్ని సమాధి నుంచి బయటతీసి పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడికి ఆదివారం రాత్రి తన భార్యతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను కొట్టాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై కోపంతో రాజ్​కుమార్​ తన నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశాడు. అనంతరం ఆదివారం రాత్రి వాగులో పడేశాడు. కాసేపటికే మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి ఇంటి ఆవరణలో పాతిపెట్టాడు. ఈ విషయం గమనించిన స్థానికులు నిందితుడి భార్యకు సమాచారం అందించారు. దీంతో ఆమె తన తల్లితో కలిసి తన కుమార్తె ఆచూకీ కోసం భర్త రాజ్​కుమార్​ను ప్రశ్నించింది. అతడు స్పందించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. తన భార్యపై కోపంతోనే చిన్నారిని హత్య చేసినట్లు తెలిపాడు.

పేరెంట్స్ హత్య.. నిందితుడికి మరణశిక్ష..
తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో సందీప్(47) అనే వ్యక్తికి మరణశిక్ష విధించింది ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​ జిల్లా కోర్టు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన గురుదత్, శైలేంద్రలకు చెరో ఐదేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.1,000 జరిమానాను విధించింది. ఈ తీర్పును దుర్గ్ జిల్లా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శైలేష్ కుమార్ తివారీ వెలువరించారు. నిందితుడు సందీప్​ 2018 జనవరి 1న తండ్రి రావల్​మల్​ జైన్​(72), తల్లి సుర్జీ దేవి (67)ని తుపాకీతో కాల్చి చంపాడు. ఆస్తి విషయంలో గొడవ వల్లే నిందితుడు తల్లిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.