సరిహద్దులో పాక్​ డ్రోన్​ కూల్చివేత.. గ్రెనేడ్లు, బాంబులు స్వాధీనం!

author img

By

Published : May 29, 2022, 1:49 PM IST

Drone shot down in Kathua

Pakistan drone shot down: జమ్ముకశ్మీర్​, కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్​కు చెందిన ఓ డ్రోన్​ను కూల్చివేశాయి భద్రతా దళాలు. డ్రోన్​ మోసుకొచ్చిన బాక్సులో గ్రెనేడ్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Pakistan drone shot down: జమ్ముకశ్మీర్​లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోమారు డ్రోన్​ కలకలం సృష్టించింది. కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్​కులోకి ప్రవేశించిన ఓ డ్రోన్​ను ఆదివారం ఉదయం కూల్చివేశాయి భద్రతా బలగాలు. పాకిస్థాన్​కు చెందిన ఆ డ్రోన్​ ఆయుధాలతో సరిహద్దు దాటినట్లు తెలిపాయి. రాజ్​బాఘ్​ పోలీస్​ స్టేషన్​ పరిధి, తాలి హరియా చాక్​ సరిహద్దుల్లో డ్రోన్​ ఎగురుతుండటం కనిపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరిపినట్లు జమ్ముకశ్మీర్​ పోలీసు ప్రతినిధి తెలిపారు.

Drone shot down in Kathua
పాకిస్థాన్​ డ్రోన్​

"ఆదివారం ఉదయం సరిహద్దుల్లో డ్రోన్​ సంచారాన్ని గమనించిన పోలీసులు భారత్​లోకి ప్రవేశించగానే దానిపై కాల్పులు జరిపారు. వెంటనే కుప్పకూలిపోయింది. పెద్ద బాక్సును మోసుకోస్తున్నట్లు గుర్తించాం. దానిని బాంబు నిర్వీర్య బృందం పరిశీలించింది. "

- ఎస్​ఎస్​పీ కథువా.

డ్రోన్​ మోసుకొచ్చిన పెద్ద బాక్సులో 7యూబీజీఎల్​(అండర్​ బ్యారెల్​ గ్రెనేడ్​ లాంచర్లు), 7 మ్యాగ్నెటిక్​ బాంబులును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఎస్​ఎస్​పీ. డ్రోన్​ కూల్చేసిన ప్రాంతాన్ని బాంబు నిర్వీర్య బృందం తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు.

Drone shot down in Kathua
గ్రెనేడ్లు, బాంబులను చూపుతున్న పోలీసులు

కశ్మీర్​లోని అమర్​నాథ్​ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆయుధాలతో డ్రోన్​ కనిపించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే నిఘా విభాగం హెచ్చరికలతో ఇప్పటికే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 43 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్​ 30న రెండు దారుల్లో మొదలవుతుంది.

Drone shot down in Kathua
డ్రోన్​ మోసుకొచ్చిన బాక్సును పరిశీలిస్తున్న అధికారులు
Drone shot down in Kathua
డ్రోన్​ను తీసుకెళ్తున్న జవాన్లు

ఇదీ చూడండి: జైలుకెళ్లొచ్చిన 'హీరోయిన్' దంపతులకు పాలాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం 'కేజీఎఫ్'​ ప్లాన్​.. వర్కౌట్​ అయితే కనక వర్షమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.