సీఎం నివాసంలో కలకలం.. తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి.. రంగంలోని దిగిన పోలీసులు..!

author img

By

Published : Jan 21, 2023, 1:04 PM IST

pac jawan death

యూపీ ముఖ్యమంత్రి నివాసంలో విధులు నిర్వరిస్తున్న ఓ కానిస్టేబుల్​ అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్​ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్​ దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ముంబయిలో జరిగిన మరో ఘటనలో మతిస్థిమితం సరిగా లేని ఓ బాలికపై ముగ్గురు కాంమాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నివాసంలో విధులు నిర్వర్తించే ఓ కానిస్టేబుల్​ అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. సీఎం నివాసంలో విధులు ముగించుకుని పోలీస్​ క్యాంప్​ కార్యాలయానికి చేరుకున్న అతడు.. ప్రభుత్వ వాహనంలోనే విగతజీవిగా కనిపించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలీగఢ్​​కు చెందిన విపిన్​ కుమార్ అనే 2021 బ్యాచ్​కు చెందిన పీఏసీ కానిస్టేబుల్​.. ప్రస్తుతం లఖ్​నవూలోని ముఖ్యమంత్రి​ నివాసంలో గత నెలరోజులుగా విధులు నిర్వరిస్తున్నాడు. విపిన్ ఎప్పటిలానే​ శనివారం సీఎం నివాసంలో విధులు ముగిశాక.. రమాబాయిలోని పోలీస్​ క్యాంపు కార్యాలయానికి.. ప్రభుత్వ వాహనంలో చేరుకున్నాడు. అయితే అక్కడకు చేరుకున్న కొద్దిసేపటికే ఆ కారులో కాల్పుల శబ్ధం వచ్చింది. వెంటనే అక్కడున్న పీఏసీ కానిస్టేబుల్స్​ కారులో విపిన్​ బుల్లెట్​ గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే విపిన్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే విపిన్​ తన ఐఎన్​ఎస్​ఏఎస్ రైఫిల్​లోని బుల్లెట్​లు తగలగా మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్య, ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మానసిక వికలాంగురాలిపై రేప్​..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఓ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబయిలోని ఘట్​కోపర్ ప్రాంతంలో మతిస్థిమితం సరిగా లేని బాలిక ఇంటినుంచి బయటకు రాగా.. ముగ్గురు మైనర్​లు ఆమెను టాయిలెట్​లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం దాన్ని వీడియోతీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. దీంతో ఆ వీడియో స్థానికంగా వైరల్​గా మారింది. వైరల్​గా మారిన ఆ వీడియోను ఆమె సోదరుడు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితులను అదుపులోకి తీసుకుని జువైనల్​ హోమ్​కు తరలించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.