దావూద్​ కేసులో వారికి ఎన్​ఐఏ ఉచ్చు.. 20 చోట్ల సోదాలు

author img

By

Published : May 9, 2022, 11:34 AM IST

Updated : May 9, 2022, 2:04 PM IST

NIA raids today

NIA raids today: దావూద్‌ ఇబ్రహీం, అతడి ముఠా వ్యవహారాలపై విచారణ ముమ్మరం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ.. ముంబయిలోని 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. డి కంపెనీపై నమోదు చేసిన కేసులో విచారణ వేగవంతం చేసినట్లు పేర్కొంది. పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​ఐఏ అధికారులు తెలిపారు.

NIA raids today: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం, అతడి ముఠాకు సంబంధించి వ్యవహారాలపై విచారణ ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు.. ముంబయిలోని సుమారు 20 ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. 'డి' కంపెనీపై నమోదు చేసిన కేసులో విచారణ ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. నాగ్​పాడ, గోరెగావ్​, బోరివలి, సాంటాక్రూజ్​, ముంబ్రా, భిండి బజార్​ వంటి కీలక ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు.

నవాబ్ మాలిక్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లోని చాలా మంది అనుమానితులను కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు ఎన్​ఐఏ వర్గాల వెల్లడించాయి. అండర్ వరల్డ్ డాన్ కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పని చేస్తున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నాయి. ఈరోజు జరిగిన దాడుల్లో ఎక్కువమంది హవాలా వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నట్లు వెల్లడించాయి. దావూద్​కు చెందిన డి కంపెనీని ఉగ్రవాద సంస్థగా, 1993 ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2003లో ప్రకటించింది అమెరికా.

ఎన్​ఐఏ అదుపులోకి కీలక వ్యక్తులు: దావూద్​ కేసులో సోమవారం విస్తృత సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ.. గ్యాంగ్​స్టర్​ చోటా షకీల్​ అనుచరుడు, అతని సోదరి భర్త సలీమ్​ ఖురేషి అలియాస్​ సలీమ్​ ఫ్రూట్​ను అదుపులోకి తీసుకుంది. దక్షిణ ముంబయి, భెండి బజార్​లోని నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కీలకమైన పత్రాలను సీజ్​ చేశామన్నారు. సలీమ్​తో పాటు మహిమా ప్రాంతానికి చెందిన ఖయ్యుమ్​, మహిమ్​ దర్గా మేనేజింగ్​ డైరెక్టర్​ సుహేల్​ కంద్వానీ, బంద్రాలోని డిలైట్​ అపార్ట్​మెంట్​లో సమీర్​ అంగోరాను అదుపులోకి తీసుకుంది ఎన్​ఐఏ.

ఇదీ చూడండి: 'హైబ్రిడ్ ఉగ్రవాదుల కేసు'లో 25మందిపై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్

Last Updated :May 9, 2022, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.