భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

author img

By

Published : Oct 11, 2021, 1:23 PM IST

Updated : Oct 11, 2021, 6:42 PM IST

MUSLIM WOMAN HINDU TEMPLE

ఓ ముస్లిం మహిళ.. దుర్గాదేవి గుడిలో జరిగిన పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. కర్ణాటకలోని ఈ మందిరాన్ని ఆమె భర్తే నిర్మించడం విశేషం.

భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

హిందూ-ముస్లిం భాయీభాయీ (Hindu Muslim unity in India) అనేది దేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ-ముస్లిం మధ్య సఖ్యతను (Hindu Muslim unity) చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. ఓ ముస్లిం మహిళ.. హిందూ గుడిలో పూజలు చేశారు. మత సామరస్యానికి అద్దం పట్టే ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. (Karnataka Shivamogga news)

MUSLIM WOMAN HINDU TEMPLE
దుర్గామాత ఆలయం ముందు ముస్లి మహిళ ఫమీదా
MUSLIM WOMAN HINDU TEMPLE
ఆలయంలో అమ్మవారు

దసరా సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేయడం హిందువుల ఆనవాయితీ. ప్రతి దుర్గా దేవి గుడిలో ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి. ఇదే విధంగా శివమొగ్గలోని సాగర్ ప్రాంతంలోనూ విశిష్ట పూజలు జరిపించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ సైతం పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. అమ్మవారి మందిరం గర్భగుడిలోకి వచ్చి పూజలో పాల్గొన్నారు ఫమీదా అనే మహిళ. తమ సంప్రదాయంగా ధరించే బుర్ఖాతోనే గుడికి వచ్చారు.

MUSLIM WOMAN HINDU TEMPLE
ఫమీదా

50 ఏళ్ల క్రితం నిర్మాణం

ఈ మందిరాన్ని ఫమీదా భర్త కట్టించడం మరో ప్రత్యేకత. రైల్వేలో పనిచేసే ఫమీదా భర్త.. 50 ఏళ్ల క్రితం భగవతి అమ్మవారి మందిరాన్ని కట్టించారు. అనంతరం దాని నిర్వహణను హిందువులకు అప్పగించారు. నిత్యం ఇక్కడ పూజలు జరిపిస్తారు. చుట్టుపక్కల వారు ఈ మందిరానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు.

MUSLIM WOMAN HINDU TEMPLE
ఆలయం గర్భగుడిలో భక్తులు..

ఇవీ చదవండి:

Last Updated :Oct 11, 2021, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.