బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం​.. గర్భం దాల్చాక ఇంట్లోనే గుట్టుగా...

author img

By

Published : May 15, 2022, 10:49 AM IST

Rape

కన్న కుమార్తెపై తన ప్రియుడు అత్యాచారం చేసేందుకు అంగీకరించింది ఓ తల్లి. గర్భం దాల్చిన కుమార్తెకు ఇంట్లోనే డెలివరీ చేసింది. చివరకు ప్రియుడితో పాటు కటకటాలపాలైంది. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.

అమ్మతనానికే మచ్చ తెచ్చే సంఘటన ఇది. కూతురిపై ఈగ వాలితేనే తల్లడిల్లిపోతుంది తల్లి. అలాంటిది ఓ తల్లి కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేసేందుకు అంగీకరించింది. గర్భం దాల్చటం వల్ల ఎవరికీ తేలియకూడదనే కారణంతో ఇంట్లోనే పురుడు పోసింది. పుట్టిన పాప అనారోగ్యానికి గురికాగా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లిన క్రమంలో అసలు విషయం బయటపడింది. ఈ అమానవీయ సంఘట తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది: చెన్నైకి చెందిన 38 ఏళ్ల మహిళ.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 50 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె కుమార్తె(17)ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ప్రియుడు. దీంతో ఆమెపై అత్యాచారం చేసేందుకు అంగీకరించింది. బాలిక గర్భం దాల్చటం వల్ల స్కూల్​ మాన్పించింది. ఇంట్లోనే ఉంచి.. తన ప్రియుడితో గుట్టుగా వివాహం జరిపించింది. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడింది.

మే 1న పురిటి నొప్పులు వస్తున్నట్లు బాలిక తెలిపింది. ఆసుపత్రికి తీసుకెళితే విషయం బయటపడుతుందని ఇంట్లోనే బాత్​రూమ్​లో డెలివరీ చేసింది ఆమె తల్లి. శిశువు అనారోగ్యానికి గురికాగా.. చేసేదేమీ లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. శిశువు జననం, ఆమె తల్లి వివరాలను అక్కడి సిబ్బంది అడగగా.. కుమార్తె ఆధార్​ కార్డు చూపించింది. ఆధార్​లో బాలిక వయసును గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీకి సమాచారం అందించారు.

చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ విచారణంలో తన ప్రియుడితో గుట్టుగా కుమార్తె వివాహం జరిపించటం, ఇంట్లోనే పురుడు పోసిన విషయం బయటపడింది. దీంతో చెన్నై పోలీసులు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్​ చేసి దర్యాప్తు చేప్టారు.

ఇదీ చూడండి: లోన్ ఆశచూపి మహిళపై అత్యాచారం.. కత్తితో బెదిరించి గ్యాంగ్​రేప్!

'పిల్ల దొరికినా పెళ్లి చేయట్లేదు'.. తల్లిదండ్రులపై యువకుడి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.