మైనర్‌పై రిక్షా డ్రైవర్ల గ్యాంగ్‌రేప్.. స్కూల్ ఫీజు కట్టలేదని వేధింపులు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..
Published: Nov 10, 2022, 10:58 PM


మైనర్‌పై రిక్షా డ్రైవర్ల గ్యాంగ్‌రేప్.. స్కూల్ ఫీజు కట్టలేదని వేధింపులు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..
Published: Nov 10, 2022, 10:58 PM
ఓ మైనర్‌పై ఇద్దరు ఈ-రిక్షా డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. మరోవైపు, స్కూలు యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్థి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసిందీ ఘటన.
బిహార్.. బగాహలో దారుణం జరిగింది. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. బాధితురాలు తనకు కాబోయే భర్తతో కలిసి నేపాల్‌లోని కంటి ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ఇద్దరు ఈ-రిక్షా డ్రైవర్లు ఆమెను అడవిలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు తనపై జరిగిన ఘోరాన్ని స్థానికులకు చెప్పింది. వెంటనే స్థానికులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు విస్తృతంగా గాలింపు జరిపి మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఫీజు కట్టలేదని..
ఉత్తర్‌ప్రదేశ్.. గాజియాబాద్‌లో దారుణం జరిగింది. స్కూలు ఫీజు కట్టలేదని యాజమాన్యం వేధించడం వల్ల 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టడం ఆలస్యమవ్వడం వల్ల పాఠశాల యాజమాన్యం తన కుమారుడిని తరగతులకు హాజరుకానివ్వలేదని బాధితుడి తండ్రి సిహాని గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాలుడు మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దోషులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఏటా 12లక్షల వీసాలు!
