సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి

author img

By

Published : Sep 12, 2021, 10:04 AM IST

west bengal cm

భవానీపుర్​ ఉప ఎన్నికల(bhabanipur by election) కోసం నామినేషన్​ వేసేటప్పుడు సమర్పించిన ప్రమాణపత్రాల్లో తన ఆదాయ(Mamata Banerjee Income) వివరాలు వెల్లడించారు బంగాల్ ముఖ్యమంత్రి(West Bengal Cm) మమతా బెనర్జీ. తనకు సొంతిల్లు, సొంత వాహనం లేదని ఆమె పేర్కొన్నారు.

బంగాల్​ ముఖ్యంత్రి(West Bengal Cm), టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంతిల్లు లేదు. తనకంటూ సొంత వాహనం లేదు. ఈ విషయాన్ని భవానీపుర్​ ఉపఎన్నికల(bhabanipur by election) కోసం శుక్రవారం నామినేషన్ వేసినప్పుడు సమర్పించిన ప్రమాణపత్రాల్లో పేర్కొన్నారు మమత. అయితే.. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మమత ఆదాయం(Mamata Banerjee Income) పెరిగినట్లు తెలుస్తోంది. మే నెలలో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్రిగామ్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత.. మమత ఆదాయం రూ.5లక్షల మేర పెరిగింది.

ఆదాయం ఎంతంటే..?

  • 2019-20లో మమత ఆదాయం రూ.10,34,370గా ఉంది. 2020-21లో అది రూ.16,47,845కు పెరిగింది.
  • 2016 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రాల్లో... మమత ఆదాయం రూ.8,18,300గా ఉంది. అయితే.. 2018-2019లో ఆమె ఆదాయం గణనీయంగా రూ.20,71,010కి పెరగడం గమనార్హం.

శుక్రవారం సమర్పించిన ప్రమాణ పత్రాల ప్రకారం.. మమత బ్యాంక్​ బ్యాలెన్స్​ తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యాంక్​ బ్యాలెన్స్​ రూ.13,11,512గా ఉంది. నందిగ్రామ్ ఎన్నికల సమయంలో ఈ విలువ 13,53,000గా ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మమత బ్యాంక్ బ్యాలెన్స్​ రూ.27,61,000గా ఉండటం గమనార్హం. ప్రస్తుతం తన వద్ద రూ.69,255 నగదు ఉన్నట్లుగా మమత.. ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.

ఆస్తులు తగ్గాయ్​..

దీదీ స్థిరాస్తులు, చరాస్తులు కూడా బాగా తగ్గినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల సమంయలో తన వద్ద రూ.30,75,000 విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు మమత తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తన వద్ద రూ.16,72,352.11 విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే.. ప్రసుతం తన ఆస్తుల విలువ రూ.15,38,029గా మాత్రమేనని తెలిపారు.

ఈ ఆస్తులతో పాటు దీదీ వద్ద 9.7 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆమెకు ఏ బ్యాంకు నుంచి అప్పులు లేవు.

ఇదీ చూడండి: దీదీకి పోటీగా ప్రియాంక.. తెరవెనక బాబుల్​ సుప్రియో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.