'లఖింపుర్ హింస' ఎన్నికల్లో భాజపాను దెబ్బకొడుతుందా?

author img

By

Published : Oct 5, 2021, 11:30 AM IST

Lakhimpur Kheri clash might harm BJP in upcoming polls

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్ ఘటన (Lakhimpur Kheri incident) పార్టీపై దృష్ప్రభావం చూపకుండా భాజపా జాగ్రత్త పడుతోంది. ఎన్నికల్లో ఈ అంశం భాజపాకు ప్రతికూలం కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనపై నేతలు మాట్లాడకూడదని, సీనియర్లు మాట్లాడినా.. పరిణతితో వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటన (Lakhimpur Kheri incident) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు అన్నదాతలు మరణించారు. అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు మృతి చెందారు. దీనిపై రాష్ట్రంలో విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించాయి.

అయితే, రాష్ట్రంలోని భాజపా సర్కారు.. ఘటనపై (Lakhimpur Kheri incident) సత్వర చర్యలే చేపట్టింది. హింసాకాండపై అదేరోజు స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. రైతులు మరణించడం బాధాకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగాక, బాధిత రైతుల కుటుంబాలకు పరిహారం, ఘటనపై న్యాయవిచారణకు మంగళవారం ఆదేశించారు. దీన్నిబట్టి ఈ సమస్యను (Lakhimpur Kheri violence) దేశవ్యాప్తం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నివారించేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది.

లఖింపుర్ హింసపై (Lakhimpur Kheri incident) పార్టీ నాయకత్వం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని భాజపా వర్గాలు చెబుతున్నాయి. నష్టనివారణ కోసం అధిష్ఠానం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. 2022లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. దీనిపై ఈ ఘటన (Lakhimpur Kheri violence) తాలూకు ప్రభావం పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడొచ్చని వెల్లడించాయి.

ఇదీ చూడండి: రైతులపైకి కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన దృశ్యాలు!

ఖండించిన భాజపా ఎంపీ

ఈ ఘటనపై (Lakhimpur Kheri incident) పార్టీలోని పలువురు నేతలు తీవ్రంగా స్పందించడం వల్ల అధిష్ఠానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ విపక్షాలకు ధీటుగా బదులిచ్చే పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ.. లఖింపుర్ ఘటనను (Lakhimpur Kheri violence) ఖండిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లఖింపుర్ ఘటనపై (Lakhimpur Kheri) దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, హింసపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఘటనపై మాట్లాడొద్దు..

మరోవైపు, ఈ విషయంపై పరిణతితో మాట్లాడాలని పార్టీ అధినాయకత్వం సీనియర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన నాయకులు దీనిపై (Lakhimpur Kheri violence) మాట్లాడకపోవడమే మంచిదని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే.. క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు వెల్లడించాయి.

'ఖలిస్థానీ పనే'

అయితే, పలువురు భాజపా నేతలు మాత్రం తెరవెనక దీనిపై కామెంట్ చేస్తున్నారు. ఖలిస్థానీ బృందాల సూచనల మేరకే హింస (Lakhimpur Kheri incident) జరిగిందని చెబుతున్నారు. లఖింపుర్ ఖేరి ప్రాంతంలో 'బబ్బర్ ఖాల్సా' అనే సిక్కు తీవ్రవాద ముఠా క్రియాశీలంగా ఉందని, ఈ విషయం యూపీ, పంజాబ్ పోలీసులు 2017లో చేపట్టిన జాయింట్ ఆపరేషన్​లో తేలిందని గుర్తు చేస్తున్నారు.

'విపక్షాల రాద్ధాంతమే'

హింసపై (Lakhimpur Kheri incident) ఈటీవీ భారత్​తో మాట్లాడిన భాజపా జాతీయ ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్.. రైతులు ఇంకా ఉద్యమం చేయడం దురదృష్టకరమని అన్నారు. విపక్షాలు ఈ ఘటనను తమ కుట్రలను అమలు చేసేందుకు ఉపయోగించుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించినప్పుడు.. రైతులు ఆందోళన చేయాల్సిన అవసరమేంటి? ప్రభుత్వం కూడా చట్టాలని నిలిపివేసింది. రైతులతో చర్చలకు సిద్ధమేనని స్పష్టంగా చెప్పింది. కానీ విపక్షాలు రైతుల నిరసనలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. యోగి ప్రభుత్వం పరిహారం ప్రకటించిన.. తమ స్వప్రయోజనాల కోసమే విపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి."

-గోపాల్ కృష్ణ అగర్వాల్, భాజపా జాతీయ ప్రతినిధి

ఏం జరిగిందంటే...?

లఖింపుర్‌ ఖేరి జిల్లాలోని అజయ్‌ మిశ్ర స్వగ్రామమైన బన్బీర్‌పుర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయనతో పాటు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరు కావాల్సి ఉంది. అయితే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులు కేశవ్‌ ప్రసాద్‌ ఎదుట నిరసన (Lakhimpur Kheri violence) వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అందుకోసం తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కేశవ్‌ ప్రసాద్‌కు స్వాగతం పలకడానికి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర వాహన శ్రేణితో అటువైపు రాగా రైతులు నల్ల జెండాలు చూపుతూ నినాదాలు చేశారు. అయితే రెండు కార్లు ఉన్నట్టుండి రైతుల మీదకు దూసుకెళ్లాయి. ఈ హఠాత్పరిణామానికి నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. గాయపడిన అన్నదాతల హాహాకారాలు, రక్తసిక్తమైన రహదారితో ఆ ప్రదేశంలో భీతావహ పరిస్థితి నెలకొంది. (Lakhimpur Kheri incident)

మంత్రి కుమారుడి అమానుష చర్యపై ఆగ్రహించిన రైతులు ఆయన కారుతో పాటు మరో కారును తగలబెట్టారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారని లఖింపురి ఖేరి జిల్లా మేజిస్ట్రేట్‌ అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. మరో 8 మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో కర్షక నేత తేజీందర్‌ సింగ్‌ విర్క్‌ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ డీజీపీ ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేశవ్‌ ప్రసాద్‌ కార్యక్రమాన్ని రద్దుచేశారు.

ఇదీ చదవండి: లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందే కేంద్రమంత్రి వార్నింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.