ప్రాచీన సంస్కృతి పునరుద్ధరణే లక్ష్యంగా.. కాశీ తమిళ సంగమ కార్యక్రమం

author img

By

Published : Nov 19, 2022, 5:19 PM IST

Updated : Nov 19, 2022, 7:58 PM IST

kasi tamil sangam 2022

వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంగమం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశంలో మధ్య ప్రాచీన కాలంలో సాంస్కృతిక కేంద్రాలుగా తమిళనాడు, కాశీలు గుర్తింపుపొందాయని.. ఆనాటి సంబంధాలను పునరుద్ధరించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తమిళనాడు, కాశీల మధ్య ప్రాచీనకాలంలో కొనసాగిన సంబంధాలను పునరుద్ధరించటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న.. కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసిలో శనివారం ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే అతి ముఖ్యమైన, ప్రాచీన సాంస్కృతిక కేంద్రాలుగా గుర్తింపు పొందిన తమిళనాడు, కాశీ మధ్య ఉన్న ప్రాచీనకాలం నాటి సంబంధాలను తిరిగి పునరుద్ధరించి, వేడుక చేసుకోవటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

kasi tamil sangam 2022
కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ

తమిళనాడు నుంచి వివిధ రంగాలకు చెందిన 2,500 ప్రతినిధులు వచ్చారు. వీరంతా పలు సెమినార్లలో పాల్గొని.. తమ వర్గాని చెందిన స్థానిక ప్రజలను కలిసి మాట్లాడనున్నారు. ఇరురాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, వ్యాపారులు, కళాకారులు.. తమ అనుభవాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకొని.. ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకోవటమే కాశీ తమిళ సంగమం కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఐఐటీ మద్రాస్, బనారస్ హిందూ యూనివర్సిటీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

'కాశీ, తమిళనాడు రెండు సంగీత, సాహిత్య, కళారంగాలకు పెట్టిందిపేరు. కాశీ తబల, తమిళనాడు తన్నుమాయి, కాశీలో బనారస్‌ చీరలు లభిస్తాయి. తమిళనాడు కంచి సిల్క్‌ ప్రపంచప్రఖ్యాతి గాంచింది. రెండుప్రాంతాలు దేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తలు, ఆచార్యులకు జన్మభూమి, కర్మభూమి. కాశీ భక్త్‌ తులసీదాస్‌ పుట్టినగడ్డ. తమిళనాడు సంత్‌ తిరువళ్‌వర్‌ భక్త్‌ భూమి. జీవితంలోని అన్నిరంగాలు, అన్ని కోణాలతోపాటు కాశీ, తమిళనాడు వేర్వేరు రంగాల్లో సారూప్యం కనిపిస్తుంది'.
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి

Last Updated :Nov 19, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.