ఇన్​స్టాలో బగ్​.. కనిపెట్టిన విద్యార్థికి రూ.38 లక్షల రివార్డ్​.. బోనస్​ కూడా..

author img

By

Published : Sep 19, 2022, 4:11 PM IST

Instagram bug bounty winner from Jaipur wins Rs 38 lakh

అతడు ఓ ఇన్​స్టాగ్రామ్​ యూజర్​. అందరూ చేస్తున్న రీల్స్​ చూసి ఆనందించి లైక్​లు కొట్టేవాడు. కానీ అతడికి ఎక్కడో ఓ బగ్​ ఉందని అనిపించి.. నెల రోజులపాటు కష్టపడి గుర్తించాడు. వెంటనే ఫేస్​బుక్​కు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆ బగ్​ను నిర్ధరించిన ఫేస్​బుక్.. అతడికి రూ.38 లక్షలు రివార్డు ప్రకటించింది. అంతే కాదు రివార్డు చెల్లింపు ఆలస్యం అయినందుకు రూ.3 లక్షలు బోనస్​ కూడా ఇచ్చింది. అసలు ఆ ఇన్​స్టా యూజర్​ ఎవరు? ఆ బగ్​ వివరాలేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Instagram Bug Winner : ప్రస్తుత రోజుల్లో సోషల్ ​మీడియాను వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచినప్పటి నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా ఫేస్​బుక్​, వాట్సాప్​, షేర్​చాట్​, ఇన్​స్టాగ్రామ్​ తదితర యాప్​ల్లో గడుపుతున్నారు. అయితే హ్యాకర్లు.. ఇదే అదనుగా తీసుకుని సోషల్​​ మీడియా అకౌంట్లను హ్యాక్​ చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం హ్యాకర్లు.. ఎంతో మంది ఫేస్​బుక్​ అకౌంట్లను హ్యాక్​ చేసి డబ్బులు కావాలని ఫ్రెండ్స్​కు మెసేజ్​లు పెట్టారు. అలా పంపి మోసపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. రాజస్థాన్​కు చెందిన ఓ విద్యార్థి.. కోట్లాది మంది సోషల్​ మీడియా దిగ్గజం ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలను హ్యాక్​ అవ్వకుండా కాపాడాడు. అందుకుగాను భారీ మొత్తంలో రివార్డు కూడా అందుకున్నాడు. అవునండీ నిజమే.. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్​లోని జైపుర్​కు చెందిన నీరజ్​ శర్మ అనే విద్యార్థి.. తరచూ ఇన్​స్టాగ్రామ్​ వాడుతుంటాడు. తన ఫ్రెండ్స్​ చేస్తున్న రీల్స్​ను చూసి ఆనందించేవాడు. అయితే గతేడాది డిసెంబర్​లో రీల్స్​ సెగ్మెంట్​లో బగ్​ ఉందని గ్రహించాడు. అందుకు నెల రోజుల పాటు కష్టపడ్డ అతడు.. జనవరి 31న బగ్​ను గుర్తించాడు.

Instagram bug bounty winner from Jaipur wins Rs 38 lakh
నీరజ్​ శర్మ

ఆ బగ్​ వల్ల నష్టమేంటంటే.. మనం చేసిన రీల్స్​కు పెట్టిన థంబ్​నెయిల్​ను పాస్​వర్డ్​ అవసరం లేకుండా హ్యాకర్లు ఈజీగా మార్చేయవచ్చు. అయితే ఆ బగ్​ను గుర్తించిన నీరజ్​ శర్మ.. వెంటనే ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​కు తెలియజేశాడు. ఈ బగ్​ను నిర్ధరించిన ఫేస్​బుక్​.. డెమో షేర్​ చేయమని అడిగింది. వెంటనే నీరజ్​.. ఓ రీల్​ థంబ్​నెయిల్​ను ఐదు నిమిషాల్లో మార్చి వారికి చూపించాడు. అనంతరం మే 11 రాత్రి.. నీరజ్​కు ఫేస్​బుక్​ అధికారిక మెయిల్​ ఐడీ నుంచి ఓ మెయిల్​ వచ్చింది. $45,000 (సుమారు రూ. 35 లక్షలు) రివార్డ్ ఇవ్వనున్నట్లు తెలియజేసింది. అయితే మే నెలలో రివార్డ్​ ఇస్తామన్న ఫేస్​బుక్​​.. నాలుగు నెలల తర్వాత ఇచ్చింది. అందుకు గాను $4500(సుమారు రూ.3 లక్షలు) బోనస్​ కూడా ఇచ్చింది.

ఇవీ చదవండి: అమ్మాయిల ప్రైవేట్ వీడియోల లీక్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఆందోళనలు విరమించిన విద్యార్థులు

'మద్యం మత్తులో సీఎం.. కనీసం నడవ లేక ఇబ్బందులు.. విమానం నుంచి దించివేత!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.