వారికి కేంద్రం ఊరట.. ముందుగానే ప్రికాషన్​ డోసు!

author img

By

Published : May 12, 2022, 2:28 PM IST

Indians travelling overseas can take precaution dose as per guidelines of destination country

Precaution Dose Indians Travelling Overseas: విదేశాలకు వెళ్లాలనుకునే, వెళ్లే.. భారత విద్యార్థులు, పౌరులకు కేంద్రం గుడ్​న్యూస్​ చెప్పింది. ప్రయాణాలకు భారత వ్యాక్సినేషన్​ నిబంధనలు అడ్డురాకుండా ఉండేందుకు.. వారు ప్రికాషన్​ డోసు కాస్త ముందుగానే తీసుకునేందుకు అనుమతి కల్పించింది.

Precaution Dose Indians Travelling Overseas: భారత్​లో ప్రికాషన్​ డోసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లేవారు(సాధారణ పౌరులు, విద్యార్థులు) గడువు కంటే ముందుగానే టీకా తీసుకునేందుకు అనుమతి కల్పించింది. వివిధ దేశాల నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్​ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీని గురించి సమాచారం.. త్వరలో కొవిన్​ పోర్టల్​లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.

సాధారణంగా.. వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత ప్రికాషన్​ డోసు తీసుకోవాలని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోసం, ఆయా దేశాల నిబంధనలకు అనుగణంగా.. మార్గదర్శకాలను సడలించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంటే.. 9 నెలల కంటే ముందుగానే ఇప్పుడు వారు టీకా తీసుకునే వెసులుబాటు కల్పించింది.

జనవరి 10న దేశంలో మూడో డోసు(ప్రికాషన్​) పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ప్రికాషన్‌ డోసు అందించారు. అయితే ఏప్రిల్‌ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరూ ప్రికాషన్‌ డోసు వేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'ఏడాదిలోపు పిల్లల్ని కనండి లేదా రూ.5 కోట్లు ఇవ్వండి'

దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.