Covid cases in India: దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు

author img

By

Published : Oct 19, 2021, 9:23 AM IST

Updated : Oct 19, 2021, 10:07 AM IST

COVID cases

భారత్​లో ఒక్కరోజే 13,058 మంది​కి (Covid cases in India) వైరస్​ సోకింది. మరో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19,470 మంది కరోనాను జయించారు.

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 13,058 మంది​కి కరోనా (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 164 మంది మరణించారు. ఒక్కరోజే 19,470 మంది రికవరీ అయ్యారు.

  • మొత్తం కేసులు: 3,40,94,373
  • మొత్తం మరణాలు: 4,52,454
  • మొత్తం కోలుకున్నవారు: 3,34,58,801
  • యాక్టివ్ కేసులు: 1,83,118

టీకాల పంపిణీ

ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 98,67,69,411 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,42,986 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 4,921 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,18,70,992 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,20,294 కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 51,178 మందికి వైరస్​ సోకింది. మరో 660 మంది వైరస్​​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్​ కేసులు కాస్త పెరిగాయి. కొత్తగా 49,156 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. తాజాగా 45 మృతి చెందారు.
  • రష్యాలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. తాాజాగా 34,325 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 998 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.
  • టర్కీలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 29,240 మందికి వైరస్​ బారిన పడగా.. 214 మంది మరణించారు.
  • ఇరాన్​లో కొత్తగా 11,844 మందికి కొవిడ్​ సోకగా.. 181 మంది చనిపోయారు.

ఇదీ చదవండి:కరోనా వేళ.. అతి జాగ్రత్తలతో అనర్థాలు తప్పవు!

Last Updated :Oct 19, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.