కరోనా కొత్త కేసుల కంటే.. కోలుకున్నవారే ఎక్కువ

author img

By

Published : May 14, 2022, 9:30 AM IST

Updated : May 14, 2022, 9:53 AM IST

India Corona Cases

Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 2,858 మందికి వైరస్​ సోకింది. మరో 11 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 99 శాతానికి చేరువైంది. ఒక్కరోజే నమోదైన కేసుల కంటే.. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.

Coronavirus Update India: భారత్​లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 2,858 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 11 మంది చనిపోయారు. ఒక్కరోజే 3,355 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్​ కేసులు 18 వేల వద్ద ఉన్నాయి. యాక్టివ్​ కేసుల శాతం 0.04గా ఉంది. మరణాల శాతం 1.22గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,19,112‬
  • మొత్తం మరణాలు: 5,24,190
  • యాక్టివ్​ కేసులు: 18604
  • కోలుకున్నవారి సంఖ్య: 42576815

Vaccination India: దేశవ్యాప్తంగా శుక్రవారం 15 లక్షల మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 191 కోట్ల 15 లక్షల 90 వేలు దాటింది. ఒక్కరోజే 4 లక్షల 86 వేల 900కుపైగా కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజే మరో 5 లక్షల 50 వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1600మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,02,89,101కు చేరింది. మరణాల సంఖ్య 62,86,519కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,49,09,980గా ఉంది.

  • అమెరికాలో 87 వేల కేసులు, 272 మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీలో 67వేలకుపైగా కొత్త కేసులు, 181 మరణాలు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్​లో సగటున రోజుకు 30వేలకుపైగా వైరస్​ బారినపడుతున్నారు.
  • ఆస్ట్రేలియాలో 50 వేలకుపైగా కేసులు, జపాన్​లో 43 వేల కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: కాస్ట్​లీ కార్లలో తిరుగుతూ మహిళలకు టోకరా.. 100 మందిని నమ్మించి!

'వర్క్​ఫ్రమ్​ హోం' క్యాన్సిల్.. 800 మంది ఉద్యోగులు రాజీనామా!

Last Updated :May 14, 2022, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.