భారత్​లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

author img

By

Published : May 10, 2022, 9:16 AM IST

India Corona Cases

India Corona Cases: భారత్​లో కొవిడ్​ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2288 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. 12-14 ఏళ్ల వయసుగల 3 కోట్లమందికిపైగా యువత టీకా తొలి డోసు పొందినట్లు కేంద్రం తెలిపింది.

India Corona Cases: భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 2,288 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 10 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసులు మళ్లీ 20 వేల దిగువకు చేరాయి. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజే 3044 మంది కొవిడ్​ నుంచి కోలుకొని.. డిశ్చార్జయ్యారు. యాక్టివ్​ కేసుల శాతం 0.05, మరణాల శాతం 1.22గా ఉంది.

మొత్తం కరోనా కేసులు: 4,31,07,689‬

మొత్తం మరణాలు: 524103

యాక్టివ్​ కేసులు: 19637

కోలుకున్నవారి సంఖ్య: 42563949

Vaccination India: దేశవ్యాప్తంగా సోమవారం 13 లక్షల 90 వేల 912 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 190 కోట్ల 50 లక్షల 86 వేలు దాటింది. 12-14 ఏళ్ల వయసుగల 3 కోట్ల మందికిపైగా యువత వ్యాక్సిన్​ తొలి డోసు పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వెల్లడించారు. ఒక్కరోజే మరో 4 లక్షల 84 వేల 843 టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం పరీక్షల సంఖ్య 84.15 కోట్లు దాటింది.
Global Corona Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 3 లక్షల 33 వేలకుపైగా కేసులు.. వెయ్యికిపైగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 51 కోట్ల 76 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 62 లక్షల 77 వేలకు చేరింది.

  • అమెరికాలో ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు.. 100కు పైగా మరణాలు వెలుగుచూశాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8 కోట్లకుపైనే.
  • జర్మనీ, జపాన్​, ఆస్ట్రేలియాల్లో రోజువారీగా సగటున 40 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
  • దక్షిణ కొరియాలో సోమవారం ఒక్కరోజే 20 వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​, యూకే, ఫ్రాన్స్​, రష్యాల్లో రోజుకు 10వేలకు దిగువనే కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇవీ చూడండి: ఏసీ, ఫ్రిజ్​, ఇంటర్​నెట్​.. తెగ వాడేస్తున్న భారతీయులు!

మనవడిపై బామ్మ పోలీసు కేసు.. పెంపుడు శునకం కరిచిందని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.