Horoscope Today (05-12-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

author img

By

Published : Dec 5, 2021, 4:41 AM IST

Horoscope Today

ఈ రోజు రాశిఫలాల (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈరోజు (05-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు; మార్గశిర మాసం

శుక్లపక్షం; పాడ్యమి: ఉ. 11.21 తదుపరి విదియ; జ్యేష్ఠ: ఉ. 10.07 తదుపరి మూల

వర్జ్యం: సా. 5.35 నుంచి 7.05 వరకు

అమృత ఘడియలు: రా.2.36 నుంచి 4.06 వరకు

దుర్ముహూర్తం: సా. 3.52 నుంచి 4.36 వరకు

రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6.20, సూర్యాస్తమయం: సా.5-21; చంద్రదర్శనం

మేషం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ఎవరితోనూ విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

వృషభం

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

మిథునం

శుభకాలం. మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించాలి.

కర్కాటకం

ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రారంభించిన పనులలో ముందుచూపు అవసరం. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

సింహం

దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

కన్య

సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అనవసర విషయాలతో కాలం వృథా కాకుండా చూసుకోవాలి. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యానశ్లోకం చదవాలి.

తుల

దైవబలం కాపాడుతోంది. వృత్తి,ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పరిశీలన చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

వృశ్చికం

ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి జరుగుతుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి.

ధనుస్సు

శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి. శ్రీఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

మకరం

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాల్లో మంచి కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.

కుంభం

ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా శుభయోగం ఉంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మీనం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనః స్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

ఇదీ చూడండి: weekly horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్‌ 05 - డిసెంబర్‌ 11)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.