కాంగ్రెస్ నేతల మధ్య వార్... పీసీసీ ప్రెసిడెంట్​కు రమ్య సవాల్!

author img

By

Published : May 12, 2022, 5:32 PM IST

mandya ex MP Ramya

Karnataka Congress Ramya tweet: మండ్య మాజీ ఎంపీ రమ్య.. ట్విట్టర్ వేదికగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనపై ట్రోల్స్ చేయాలని కార్యకర్తలకు శివకుమార్ సూచించారని ఆరోపించారు. ఈ మేరకు పలు స్క్రీన్​షాట్లను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

Mandya ex MP Ramya DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్​లో నేతల మధ్య రాజకీయ రగడ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్​పై మండ్య మాజీ ఎంపీ రమ్య ట్విట్టర్​ వేదికగా విరుచుకుపడ్డారు. తనను ట్రోల్ చేయాలని పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ నేతలు సూచించారని విమర్శించారు మాజీ ఎంపీ రమ్య. ఈ మేరకు కన్నడ, ఆంగ్ల భాషలో ఉన్న పలు స్క్రీన్​షాట్లను రమ్య ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. కార్యకర్తలు అంత శ్రమ తీసుకోవద్దని, తనపై తానే ట్రోల్స్ చేసుకుంటానని ఎద్దేవా చేశారు.

mandya ex MP Ramya
రమ్య ట్వీట్లు

వివాదం మొదలైందిలా...
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ మధ్య జరిగిన భేటీ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. పీఎస్ఐ రిక్రూట్​మెంట్ స్కామ్​ విషయంలో తనను తాను రక్షించుకోవడానికి పాటిల్​తో అశ్వత్ భేటీ అయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. వీటిని అశ్వత్, పాటిల్ ఖండించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన మాజీ ఎంపీ రమ్య.. 'వేర్వేరు పార్టీల వ్యక్తులు అప్పుడప్పుడు కలుస్తుంటారు. శుభకార్యాలకూ వెళ్తారు. వేర్వేరు పార్టీల నేతల కుటుంబాల మధ్య వివాహాలూ జరుగుతుంటాయి. కాంగ్రెస్​కు ఎంతో నమ్మకంగా ఉండే పాటిల్​పై శివకుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం' అని ట్వీట్ చేశారు.

mandya ex MP Ramya
రమ్య ట్వీట్లు

ramya dk shivakumar: ఈ నేపథ్యంలోనే తనపై ట్రోల్స్ మొదలయ్యాయని రమ్య చెప్పుకొచ్చారు. ట్రోల్ చేయాలని కార్యకర్తలకు డీకే శివకుమార్ ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ ట్వీట్లకు డీకే శివకుమార్​ను ట్యాగ్ చేశారు. 'పార్టీ నుంచి రూ.8 కోట్లు తీసుకొని పారిపోయానని నాపై ట్రోల్స్ వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే నేను పార్టీకి దూరమయ్యా. నేను కాంగ్రెస్​ను మోసం చేయలేదు. నేను చేసిందల్లా మౌనంగా ఉండటమే' అని అన్నారు.

mandya ex MP Ramya
రమ్య ట్వీట్లు

MP Ramya Congress news: 2012లో కాంగ్రెస్​లో చేరిన రమ్య.. 2013-14 మధ్య మండ్య నియోజకవర్గ ఎంపీగా సేవలందించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్​గానూ పనిచేశారు. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న రమ్య.. తాజాగా స్పీడు పెంచారు. మండ్య నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, జేడీఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ ఎల్ఆర్ శివరామెగౌడ కాంగ్రెస్​లో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య డీకే శివకుమార్​తో పలుమార్లు భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్​లో చేరితే మండ్య టికెట్ ఇస్తానని శివకుమార్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి: కాంగ్రెస్ 'చింత' తీరేనా? 'యూపీఏ++'తో భాజపాను ఢీకొట్టగలిగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.