ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా ఓ కారులో విగతజీవిగా కనిపించారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు మరోవైపు దిల్లీలోని యుమునా నదిలో కృష్ణుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఐదుగురు యువకులు మునిగి చనిపోయారుSinger Vaishali Balsara Dead గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో ఓ కారులో లభ్యమైంది సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారుఇదీ జరిగింది జిల్లాలోని పార్ నదీ ఒడ్డున ఓ కారులో చాలాసేపు ఆగి ఉంది అది గమనించిన స్థానికులు కారు డ్రైవర్ చుట్టుపక్క ప్రాంతంలో ఉన్నాడేమోనని వెతికారు ఎక్కడా ఎవరూ కనిపించలేదు దీంతో అనుమానం వచ్చిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్ ఓపెన్ చూడగా బ్యాక్ సీట్లో ఓ మృతదేహం కనిపించింది వల్సాద్కు చెందిన ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహంగా పోలీసులు గుర్తించారు శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సింగర్ వైశాలి బల్సారావైశాలి భర్త హితేశ్ కూడా గాయకుడే ఇద్దరూ కలిసి పలు స్టేజ్ షోల్లో పాల్గొన్నారు శనివారం అర్ధరాత్రి 2 గంటలకు తన భార్య కనిపించడం లేదని హితేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఆదివారం ఉదయం వైశాలి మృతదేహం లభ్యమైంది అయితే ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు సింగర్ వైశాలి బల్సారానిమజ్జనానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతియమునా నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతి చెందిన విషాద ఘటన దిల్లీలో వెలుగుచూసింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మునిగిపోయిన ఐదుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు పోలీసుల వివరాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు యువకులంతా యుమునా నది వద్దకు చేరుకున్నారు అనంతరం ఆరుగురు యువకులు నదిలోకి వెళ్లారు ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడం వల్ల ఐదుగురు కొట్టుకుపోయారు ఒకరు మాత్రమే ఒడ్డుకు చేరుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు యువకులంతా 25 ఏళ్లలోపు వారేనని చెప్పారు మృతులను లక్కీ వీరూ అంకిత్ లలిత్ సానుగా గుర్తించారు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు పోలీసులుఇవీ చదవండి బుల్బుల్ పిట్టపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయం 8వ తరగతిలో పాఠంఆమెకు ఆరుగురు పిల్లలు తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడితో ప్రేమ పెళ్లికి నో చెప్పాడని చున్నీతో హత్య