'పిల్ల దొరికినా పెళ్లి చేయట్లేదు'.. తల్లిదండ్రులపై యువకుడి ఫిర్యాదు

author img

By

Published : May 14, 2022, 1:24 PM IST

Dwarf person marriage

Dwarf person marriage: పిల్ల దొరికినా పెళ్లి చేయటం లేదంటూ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉత్తర్​ప్రదేశ్​ శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్​ మన్సూరీ. పెళ్లి కావట్లేదని ఏడాది క్రితం వార్తల్లో నిలవగా.. ఓ యువతి ముందుకొచ్చింది. అయితే, ఏడాదిగా వివాహం చేయకపోవటంపై విసుగు చెందిన అజీమ్​.. ఇప్పుడు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు.

పెళ్లి చేయట్లేదని తల్లిదండ్రులపై అజీమ్​ మన్సూరీ ఫిర్యాదు

Dwarf person marriage: పొట్టిగా ఉండటం వల్ల తనకు పెళ్లికావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజీమ్​ మన్సూరీ మరోసారి పోలీస్​ స్టేషన్​ తలుపుతట్టారు. పెళ్లికూతురు దొరికినా.. వివాహం చేయటం లేదంటూ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. మూడు అడుగుల పొడవున్న అజీమ్​.. తన వివాహం విషయంలో సాయం చేయాలంటూ శామ్లీ స్టేషన్​ ఇంఛార్జికి మొరపెట్టుకున్నారు. హాపుఢ్​ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో 2021లోనే వివాహం నిశ్చయమైనా.. తల్లిదండ్రులు జాప్యం చేస్తున్నారని తెలిపారు.

" కొద్ది రోజులు వేచి ఉండాలని నా తల్లిదండ్రులు నన్ను ఒప్పించారు. నా ఇద్దరు సోదరులతో కలిసి వివాహం ఘనంగా జరిపిస్తామని చెప్పారు. కానీ, అంతవరకు వేచి ఉండే ఓపిక నాకు లేదు."

- అజీమ్​ మన్సూరీ, మరుగుజ్జు యువకుడు.

అజీమ్​ మన్సూరీ ఇచ్చిన ఫిర్యాదును అందుకున్నారు కైరానా ఎస్​హెచ్​ఓ. వివాహం విషయమై ఫిర్యాదు చేశారని, ఈ విషయమై అతడి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.
ఇదీ కథ: ఉత్తర్​ప్రదేశ్​కు శామ్లీకి చెందిన 26 ఏళ్ల అజీమ్​ మన్సూరీ.. 3 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటారు. ఎన్నో సంబంధాలు వచ్చినా ఎత్తు తక్కువ ఉన్నందువల్ల పెళ్లి కుదరలేదు. దాంతో 2021లో స్థానిక మహిళా పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించి.. వైరల్​గా మారాడు. దీంతో గాజియాబాద్​కు చెందిన రెహానా అనే మరుగుజ్జు యువతి అజీమ్​ను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చింది. రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న రెహానా సైతం ఇదే సమస్యతో ఇబ్బందులు పడింది. ఏడాది క్రితం వివాహం చేసేందుకు నిర్ణయించినా.. ఇప్పటికీ పెళ్లి చేయకపోవటం వల్ల మరోసారి పోలీసులను ఆశ్రయించారు అజీమ్​.

ఇదీ చూడండి: 'సల్మాన్​ సినిమాలో ఛాన్స్​ వద్దు.. పెళ్లే ముద్దు'

ఎట్టకేలకు అతనికి పెళ్లికూతురు దొరికింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.