Covid Deaths In India: భారత్​లో ఒక్కరోజే 2 వేలకుపైగా కరోనా మరణాలు!

author img

By

Published : Dec 5, 2021, 10:08 AM IST

Updated : Dec 5, 2021, 10:58 AM IST

CORONA CASES

Covid Cases In India Today: దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 2,796 మంది మరణించారు. 8,190 మంది కోలుకున్నారు.

Covid Cases In India Today: దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,895 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 2,796 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్​, కేరళలో సవరించిన లెక్కలతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది.

  • మొత్తం కేసులు: 3,46,33,255
  • మొత్తం మరణాలు: 4,73,326
  • యాక్టివ్​ కేసులు: 99,155
  • మొత్తం కోలుకున్నవారు: 3,40,60,774

మరణాల లెక్కల సవరణ

కొవిడ్ మరణాల లెక్కలు సవరించాక బిహార్​లో 2,426, కేరళలో 263 మృతులతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొవిడ్ కేసులు 50 వేల కంటే తక్కువగా నమోదుకావటం వరుసగా ఇది 161వ రోజు అని కేంద్రం తెలిపింది. యాక్టివ్ ​కేసుల సంఖ్య.. మొత్తం కేసుల్లో 0.29 శాతం ఉన్నట్లు పేర్కొంది.

పెరిగిన మరణాల రేటు..

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.35 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.73 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.37శాతంగా ఉందని పేర్కొంది.

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. శనివారం 1,04,18,707 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,27,61,83,065కు చేరిందని స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు 127.61 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

దేశంలో అర్హులైనవారిలో 50శాతం మందికి వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు.

World Covid cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 5,26,665 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 5,651 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 265,702,506కు చేరింది. మరణాల సంఖ్య 5,264,082కు పెరిగింది.

  • US covid cases: అమెరికాలో ఒక్కరోజులో 56,742 కరోనా కేసులు బయటపడ్డాయి. 492 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • Germany covid cases: జర్మనీలో 46,379 కేసులు వెలుగులోకి వచ్చాయి. 222 మంది మహమ్మారితో మృతిచెందారు.
  • France covid cases: ఫ్రాన్స్​లో 51,624 కరోనా కేసులు బయటపడ్డాయి. 49మంది మరణించారు. 12,369 మంది కోలుకున్నారు.
  • UK covid cases: బ్రిటన్​లో 42,848కొవిడ్ కేసులు నమోదుకాగా.. 127 మంది చనిపోయారు.
  • Russia covid cases: రష్యాలో కొత్తగా 32,974 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 1,215 మంది మృతిచెందారు.
Last Updated :Dec 5, 2021, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.