దేశంలో అమాంతం పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 2.47 లక్షల మందికి వైరస్​

author img

By

Published : Jan 13, 2022, 9:26 AM IST

Updated : Jan 13, 2022, 10:00 AM IST

Covid cases in india

Covid cases in India: భారత్​లో కొత్త కరోనా కేసులు అమాంతం పెరిగాయి. మరో 2,47,417 మందికి వైరస్​ సోకింది. వైరస్​ కారణంగా మరో 380 మంది మరణించారు. 84,825 మంది కొవిడ్​ను జయించారు.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,47,417 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ ధాటికి మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,63,17,927
  • మొత్తం మరణాలు: 4,85,035
  • యాక్టివ్ కేసులు: 11,17,531
  • మొత్తం కోలుకున్నవారు: 34,715,361

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,32,024 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,45,916 మందికి కరోనా సోకింది. 8,032 మంది ప్రాణాలు కోల్పోయాు. దీంతో మొత్తం కేసులు 31,75,55,259కి చేరగా.. మరణాలు 55,30,352కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,14,494 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,269 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.43 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో బుధవారం ఒక్కరోజే 3,61,719 కేసులు వెలుగుచూశాయి. మరో 246 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 1,29,587 మంది వైరస్ బారిన పడ్డారు.​ 398 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,96,224 కొత్త కేసులు బయటపడగా.. 313 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,79,125 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: రూ.40 కోట్లు విలువ చేసే పురాతన విగ్రహాలు స్వాధీనం

Last Updated :Jan 13, 2022, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.