దేశంలో స్థిరంగా కొవిడ్ కేసులు.. ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి

author img

By

Published : Sep 18, 2022, 9:16 AM IST

CORONA CASES IN INDIA

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 35 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,555 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,34,188
  • మరణాలు: 5,28,337
  • యాక్టివ్ కేసులు: 47,922
  • రికవరీలు: 4,39,57,929

Vaccination In India :
దేశంలో శనివారం 14,84,216 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 216.56 కోట్లకు చేరింది. ఒక్కరోజే 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,38,128 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 774 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,68,56,201 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,30,060 మంది మరణించారు. మరో 5,94,451 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,62,84,233కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 77,804 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 186 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 58,305 కేసులు వెలుగుచూశాయి. మరో 107 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 43,400 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 57 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 39,628 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో 33,162 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: పోలీసులపై గ్రామస్థుల దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు.. అదే కారణం!

'సూపర్​ పవర్​గా భారత్.. ప్రపంచ మార్కెట్​ను ఆక్రమించేలా దేశీయ వ్యవస్థలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.