దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్​

author img

By

Published : Jan 12, 2022, 9:29 AM IST

Updated : Jan 12, 2022, 9:48 AM IST

Corona cases in India

Corona cases in India: దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 1,94,720 లక్షల మందికి వైరస్​ సోకింది. కరోనా ధాటికి మరో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగింది.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 1,94,720 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్​ను జయించారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,60,70,510
  • మొత్తం మరణాలు: 4,84,655
  • యాక్టివ్ కేసులు: 9,55,319
  • మొత్తం కోలుకున్నవారు: 3,46,30,536

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 85,26,240 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,53,80,08,200కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 27,72,068 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 7,847 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 31,41,01,581.. మరణాలు 55,21,038కి చేరాయి.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం మరో 6,72,872 మందికి వైరస్​ సోకింది. 2,173 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 6.33 కోట్లకు చేరింది.
  • ఫ్రాన్స్​లో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 3, 68,149 కేసులు నమోదయ్యాయి. మరో 341 మంది మరణించారు.
  • బ్రిటన్​లో మరో 1,20,821 మందికి వైరస్​ సోకింది. 379 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 2,20,532 కొత్త కేసులు బయటపడగా.. 294 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,34,942 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 247 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: 'ఇష్టం లేని శృంగారాన్ని వద్దనే హక్కు 'ఆమె'కు ఉంటుంది'

Last Updated :Jan 12, 2022, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.