Groups in AP: ఏపీలో గ్రూప్​ 1,2పోస్టుల భర్తీ.. ఓటు బ్యాంకు కోసమేనా అంటూ విమర్శలు..!

author img

By

Published : May 26, 2023, 6:44 AM IST

Groups in AP

Approval For Groups in AP: నిరుద్యోగుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఫుట్‌బాల్‌ ఆడేసుకుంటోంది. ఏటా జాబ్‌ క్యాలెండర్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. మాటను నిలబెట్టుకోలేకపోయారు. తూతూ మంత్రంగా ఒకే ఒక్కసారి క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావుడిగా.. గ్రూపు-1, 2... వెయ్యి పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడం విస్మయం కలిగిస్తోంది. ఉన్నట్లుండి ఖాళీలు నింపడం వెనుక ఆంతర్యమేంటనే చర్చ నడుస్తోంది. ఇదంతా ఓటు బ్యాంకు కోసమేనా అనే అనుమానం కలగకమానదు.

ఏపీలో గ్రూప్​ 1,2పోస్టుల భర్తీ.. ఓటు బ్యాంకు కోసమేనా అంటూ ప్రశ్నలు..!

Approval For Groups in AP: వైఎస్సార్​ కాంగ్రెస్ ప్రభుత్వం ​తీరుతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాలెండర్ విధానంలో ఉద్యోగాల భర్తీ అమలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కనీసం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రూపు-1 కింద 100, గ్రూపు-2 కింద 900 చొప్పున పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

వైసీపీ హయాంలో 'క్యాలెండర్ విధానం' అమలు పూర్తిగా అటకెక్కింది. 2021 జూన్‌లో జారీ చేసిన ప్రకారం ఇంకా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసి తీరిగ్గా.. ఎన్నికల సంవత్సరంలో గ్రూపు-1, 2 పోస్టుల భర్తీపై ప్రకటన జారీచేసింది. 2021 పోస్టుల భర్తీలో క్యాలెండర్ విధానాన్ని పాటిస్తామని, నెలల వారీగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పినా.. ఆ మేరకు చర్యలు తీసుకోలేదు.

ఎన్నికల వేళ నిరుద్యోగులపై సర్కారు కనికరం: వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ 2021 జూన్ 18, గతేడాది మార్చిలో ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తరులకు అనుగుణంగా ఇప్పటికీ గ్రూపు-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పటివరకూ గ్రూపు-2 నోటిఫికేషన్ గురించి నోరెత్తని ప్రభుత్వం.. ఎన్నికల వేళ నిరుద్యోగులపై మమకారాన్ని చూపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూపు-1, గ్రూపు-2 కింద 100, 900 చొప్పున పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెండా ఊపారని ప్రభుత్వం ప్రకటించింది. పోస్టుల భర్తీపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు.

నోటిఫికేషన్‌కు అవసరమైన కసరత్తు తుది దశలో ఉంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ జరగనుంది. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఇతర అంశాలపైనా దృష్టిసారించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిపారు. దీని ప్రకారం.. గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడతాయి. గ్రూపు-1 పోస్టులను ముందుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటే, ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్‌కు వాటిని కలిపే అవకాశం ఉండేది. ఇప్పుడా అవకాశం లేదు. భవిష్యత్తులో ఖాళీ కాబోయే పోస్టులపై అంచనాలతో ముందుగానే ఈ ప్రకటన చేస్తే ప్రస్తుత నోటిఫికేషన్ కలిసి సమయం ఆదా అయ్యేది. ఇదే సమయంలో మరోదఫా గ్రూపు- 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కొంతమందికి ప్రయోజనం ఉంటుంది.

2021 జూన్‌లో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 240 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ గతేడాది జనవరిలో, విశ్వవిద్యాలయాల్లో 2వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా ఇప్పటికీ అతీగతీ లేదు. అసలు ఈ పోస్టులు భర్తీ చేస్తారో లేదో తెలియని దుస్థితి. నోటిఫికేషన్ జారీలో జాప్యం అయ్యే కొద్దీ వయోపరిమిత పరంగా నష్టపోతున్నామని నిరుద్యోగులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.