'విదేశీ విరాళాల'పై సీబీఐ నజర్.. అదుపులో హోంశాఖ అధికారులు!

author img

By

Published : May 10, 2022, 9:00 PM IST

CBI FCRA FUNDS

CBI FCRA funds: దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. విదేశీ విరాళాల సేకరణ విషయంలో పలు కంపెనీలు, ఎన్​జీఓలు నిబంధనలను అతిక్రమించాయన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేస్తోంది. రూ.2 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించామని అధికారులు తెలిపారు.

CBI FCRA funds: ఎఫ్ఐర్​సీఏ నిబంధనలను పలు కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయ్నన ఆరోపణలపై సీబీఐ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, దిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్ నగరాలతో పాటు రాజస్థాన్​లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. మొత్తం 40 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్​సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, ఎన్​జీఓలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి.

FCRA violation MHA: కేంద్ర హోంశాఖ ఎఫ్​సీఆర్ఏ విభాగంలోని అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుమారు రెండు కోట్లకు పైగా హవాలా లావాదేవీలు జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు ఏడుగురు హోంశాఖ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు విరాళాలు పొందేందుకు ఎఫ్​సీఆర్​ఏ అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే, పలు సంస్థలు ఎఫ్​సీఆర్ఏ అనుమతులు లేకుండానే నిధులు సేకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు అనుమతులు పొందినా.. నిబంధనలు అతిక్రమించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు అప్రమత్తమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. తాజాగా చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి:

'దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదు?'

మైనారిటీ గుర్తింపు అంశంపై సుప్రీం అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.