BTech Panipuri Girl Success Story : పానీపూరి.. చిన్నాపెద్దా తేడా లేకుండా లొట్టలేసుకుని మరీ తినే ఆహారం. ముఖ్యంగా అమ్మాయిల గురించి అయితే.. చెప్పనక్కర్లేదు. కానీ, పానీపూరి అంటే పరిశుభ్రత ఉండదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఆరోగ్యకరమైన, నాణ్యమైన పానీపూరిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఓ యువతి. ఇందుకోసం బీటెక్ చదువుతున్న సమయంలోనే బీటెక్ పానీపూరివాలా పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది. అంచలంచెలుగా వ్యాపారాన్ని విస్తరించిన యువతి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది.
-
Humbled and honored to be recognized with the Business Excellence Award in Kolkata. 🏆✨ pic.twitter.com/FTLqibsa0l
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Humbled and honored to be recognized with the Business Excellence Award in Kolkata. 🏆✨ pic.twitter.com/FTLqibsa0l
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) September 3, 2023Humbled and honored to be recognized with the Business Excellence Award in Kolkata. 🏆✨ pic.twitter.com/FTLqibsa0l
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) September 3, 2023
ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌కు చెందిన తాప్తీ ఉపాధ్యాయ్ బీటెక్ పానీపూరివాలా అనే వ్యాపారాన్ని ప్రారంభించి.. దేశవ్యాప్తంగా విస్తరించింది. విహార యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం దొరకడం కష్టం అవుతుందని.. ఇలాంటి సమస్యలను అనేక సార్లు తాను ఎదుర్కొన్నానని అందుకే ఈ ఆలోచన వచ్చిందని తాప్తీ చెప్పింది. అనేక ఉత్పత్తులపై పనిచేసిన తాప్తి.. చివరకు పానీపూరి వ్యాపారాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న నేపథ్యంలో దీనికి 'బీటెక్ పానీపూరివాలా' అని పేరు పెట్టింది. తొలుత బండిపై దిల్లీలోని తిలక్‌నగర్‌లో తిరుగుతూ పానీపూరి అమ్మింది. ఆ తర్వాత తిలక్‌నగర్, హరినగర్ సహా అనేక ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఇచ్చిన హెల్తీ ఇండియా పిలుపుతోనే తాను వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పింది తాప్తీ.
- — BTECH PAANI PURI WALI (@btechpaanipuri) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) August 22, 2023
">— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) August 22, 2023
-
https://t.co/AvGyQS7ue6 pic.twitter.com/k3mlAHWYYP
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">https://t.co/AvGyQS7ue6 pic.twitter.com/k3mlAHWYYP
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) October 10, 2023https://t.co/AvGyQS7ue6 pic.twitter.com/k3mlAHWYYP
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) October 10, 2023
ఎప్పటికప్పుడు పానీపూరి రుచిని మెరుగుపరించేందుకు తమ బృందం పనిచేస్తూనే ఉంటుంది. మహిళా సాధికారత కోసం నా వంతు కృషి చేస్తున్నా. మా సంస్థలో 50కి పైగా ఉద్యోగులు ఉండగా.. అందులో 90 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. మరే ఇతర సంస్థతో మేము పోటీ పెట్టుకోము. మా ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాం. దేశవ్యాప్తంగా అనేక కాల్స్ వస్తుంటాయి. అందుకోసమే మేము ఓ ఆఫీస్‌ను నిర్వహిస్తున్నాం.
--తాప్తీ ఉపాధ్యాయ్, బీటెక్ పానీపూరివాలా వ్యవస్థాపకురాలు
స్వీట్ల వ్యాపారంలోకి ప్రవేశం
పానీపూరి వ్యాపారంలో ఎదిగిన తాప్తీ.. ప్రస్తుతం స్వీట్లపైన దృష్టి పెట్టింది. దీపావళి సందర్భంగా షుగర్, కోవా లేకుండా కేవలం ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించి స్వీట్లను తయారు చేసింది. వీటిని మార్కెట్లోకి విడుదల చేయగా మంచి ఫలితాలు వచ్చాయని తాప్తీ సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా తల్లిదండ్రులకు ఓ కారును సైతం బహుమతిగా ఇచ్చింది తాప్తీ.
-
Excited to share that BTECH PAANI PURI WALI @btechpaanipuri received an Appreciation Certificate at the SHEROES event by Radio City on Women's Day! We're proud to be recognized. Thank you @radiocityindia for the support! #SHEROES #WomensDay #WomenEntrepreneurs #viral2023 pic.twitter.com/fqBpzvkCkN
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) May 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Excited to share that BTECH PAANI PURI WALI @btechpaanipuri received an Appreciation Certificate at the SHEROES event by Radio City on Women's Day! We're proud to be recognized. Thank you @radiocityindia for the support! #SHEROES #WomensDay #WomenEntrepreneurs #viral2023 pic.twitter.com/fqBpzvkCkN
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) May 4, 2023Excited to share that BTECH PAANI PURI WALI @btechpaanipuri received an Appreciation Certificate at the SHEROES event by Radio City on Women's Day! We're proud to be recognized. Thank you @radiocityindia for the support! #SHEROES #WomensDay #WomenEntrepreneurs #viral2023 pic.twitter.com/fqBpzvkCkN
— BTECH PAANI PURI WALI (@btechpaanipuri) May 4, 2023
IAS కల నెరవేరకపోయినా..
ఐఏఎస్ కావాలన్న తన లక్ష్యం నెరవేరకపోయినా.. హెల్తీ పదార్థాలను ఉత్పత్తి చేసి ప్రజలకు సేవ చేస్తున్నాని చెప్పింది తాప్తీ. దేశవ్యాప్తంగా అనేక మంది ఫ్రాంచైజీలు కావాలని సంప్రదిస్తున్నారని తెలిపింది. దిల్లీతో పాటు గుజరాత్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ స్టాళ్లను విస్తరించింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కోసం 10వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. ప్రస్తుతం ఫ్రాంచైజీలు ఇవ్వకుండా.. తామే సొంతంగా ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో షుగర్ లేని స్వీట్లను ఉత్పత్తి చేస్తామని వివరించింది.
రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్- ఇంటర్ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్ స్టోరీ అదుర్స్
నేలపైనా, నీటిపైనా రయ్రయ్- హోవర్‌క్రాఫ్ట్ రూపొందించిన సూపర్ లేడీ సుప్రీత